మచిలీపట్నం :
గత రాత్రి మద్యం మత్తులో ట్రిపుల్ రైడింగ్ చేస్తూ పట్టుబడిన ముగ్గురు యువకులు పోలీసులపై రెచ్చిపోయారు. ట్రిపుల్ రైడింగ్ ద్విచక్ర వాహనాన్ని పట్టుకున్న ట్రాఫిక్ సిఐతో వాగ్వివాదానికి దిగిన యువకులు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు. దీనితో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ ఆ యువకులపై ఇనుకుదురుపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు తో విచారణ చేపట్టిన పోలీసులు ఆదివారం ముగ్గురు యువకులు పై కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన యువకుల వివరాలు శంకర్, రవితేజ, జీవన్ సాయి. పోలీసులతో వాగ్వాదం చేసి విధులకు ఆటంకం కలిగించిన నేరానికి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. ఇంకో యువకుడు కోసం గాలిస్తున్నారు. ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న ద్విచక్ర వాహనం పల్సర్ బైక్ ని సిజ్ చేశారు.
ఈ సందర్భంగా యువతకు ఇనుకుదురుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ పరమేశ్వరరావు కొన్ని సూచనలు చేశారు. యువకులు మద్యం మత్తులో తమ జీవితాల్ని పాడుచేసుకోవద్దని తెలిపారు.
Comments
Post a Comment