Skip to main content

శనివారం నగరంలో ప్రజాదర్బార్

మచిలీపట్నం 

కూటమి ప్రభుత్వం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు

శనివారం సాయంత్రం మంత్రివర్యులు నగరంలోని వారి క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్---ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. వారి అభ్యర్థనలను ఎంతో ఓపికగా ఆలకించి సానుకూలంగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

తొలుత మంత్రివర్యులు ఎస్సీ సంఘాల నాయకులతో కలిసి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.
మచిలీపట్నం నగరం 36వ డివిజన్ రాజుపేట కు చెందిన షేక్ మస్తానీ అర్జీ అందజేస్తూ తన కుమార్తె షేక్ ఆషాకు 90% వికలత్వం కలదని, ప్రస్తుతం నెలకు 6 వేల రూపాయలు పింఛను ప్రభుత్వం ఇస్తుందని, వైద్య ఖర్చులు కుటుంబ అవసరాల కోసం ఆ మొత్తం సరిపోవుట లేదని 15 వేల రూపాయలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు.

మచిలీపట్నం నగరం 32వ డివిజన్ ఎస్సీ కాలనీకి చెందిన ఎస్ నవీన్ కుమార్ అర్జీ అందజేస్తూ చనిపోయిన షెడ్యూల్ కులాలకు చెందిన వారిని దహనం చేయడానికి స్మశానం లేక కాలువ గట్టు మీదే దహనం చేస్తున్నామని పక్కన ఉన్న స్మశానంలో కొంత స్థలం కేటాయించాలనీ విజ్ఞప్తి చేశారు. 

మచిలీపట్నం నగరం 26వ వార్డుకు చెందిన గార్లపాటి లక్ష్మీ సుగుణ అర్జీ అందజేస్తూ తనకు 55 సంవత్సరాలని తన భర్త ఆరోగ్యం బాగాలేదని ఏ పని చేయుటకు వీలులేదని ఇంటి అద్దె చెల్లించలేకపోతున్నామని తమకు టిడ్కో జి ప్లస్ 3 ఇళ్లను కేటాయించాలని కోరారు. 
మచిలీపట్నం నగరం 48వ డివిజన్ నిజాంపేటకు చెందిన మేరుగు సాయినిర్మల అర్జీ అందజేస్తూ తాను కొన్ని సంవత్సరాలుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నానని గుంటూరు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య పరీక్షలు చేయగా గుండెలో నాలుగు రంద్రాలు ఉన్నాయని గుర్తించారని ఒక దానికి ఆపరేషన్ చేశారని మిగిలినవి చేయాలంటే ప్రాణానికి ముప్పని చెప్పారు అంటూ తన తల్లిదండ్రులు కూడా కాలం చేశారని తన బాగోగులు అన్ని వారి పిన్ని చూస్తున్నారని జీవనోపాధికి కూడా కష్టంగా ఉందని తనకు జీవనాధారానికి ఆసుపత్రి ఖర్చులకు ఒంటరి మహిళ కింద పింఛను మంజూరు చేయాలని కోరారు.
మచిలీపట్నం నగరం 50 వార్డుకు చెందిన సిరిగిరి మణి అర్జీ అందజేస్తూ తన భర్త సుబ్బారావు మరణించారని తనకు ఏ విధమైన ఆధారము లేదని జీవనం గడుపుటకు చాలా ఇబ్బందిగా ఉందని పింఛను మంజూరు చేయాలని కోరారు.
మచిలీపట్నం నగరం 28వ డివిజన్ కు చెందిన మహమ్మద్ ఆరిఫ్ అర్జీ అందజేస్తూ ఇందుకూరుపేట ప్రాంతంలో వీధి కుక్కలు ఎక్కువగా ఉన్నాయని, ప్రజలను ముఖ్యంగా పిల్లలను వెంటాడుతూ చాలా ఇబ్బందులు పెడుతున్నాయని మున్సిపల్ కమిషనర్కు చెప్పినా పట్టించుకోవటం లేదని ఫిర్యాదు చేశారు.

45 వ డివిజన్ ఇన్చార్జి రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఫణి కుమార్ ఆధ్వర్యంలో జిల్లా పశుసంవర్తక శాఖ అధికారి చిన్న నరసింహులు ఏడీలు నరసింహస్వామి రాధాకృష్ణ మంత్రివర్యులను కలిసి విజ్ఞాపన పత్రం అందజేస్తూ తమకు ఒక పశువుల హాస్టల్ నిర్మాణానికి 10 లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందని స్థలం కేటాయించాలని కోరగా మంత్రివర్యులు వెంటనే స్పందిస్తూ మంగినపూడిలో 10 ఎకరాల స్థలం గుర్తించామని అందులో 5 ఎకరాలు స్థలం తీసుకోవాలని సూచించారు. 
రైతు బజార్ దగ్గర ఉన్న తమ కార్యాలయం శిథిలావస్థలో ఉందని రామోజీ ట్రస్ట్ నుండి రైతు శిక్షణ కేంద్రం తదితర భవనాలను నిర్మించుటకు సంప్రదించామని మంత్రివర్యులు కూడా వారి సహకారం అందించాలని కోరారు. వారి కార్యాలయ ప్రవేశ మార్గంలో కల్వర్టు దెబ్బతినిందని దాన్ని విస్తరించి పటిష్టం చేయాలని మున్సిపల్ కమిషనర్ కు తెలియజేసినట్లు వివరించారు.
పశువుల ఆసుపత్రికి తాగునీటి సౌకర్యం కల్పించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. మంత్రి వెంటనే స్పందిస్తూ వారికి అన్ని వసతులు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో నగర కార్పొరేటర్ అనిత, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచే నాని, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, స్థానిక నాయకులు వెంకటస్వామి, ఇలియాస్ భాష పలువురు అర్జీదారులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...