Skip to main content

గుంతలు లేని రోడ్లు ప్రభుత్వ సంకల్పం

మచిలీపట్నం:

- నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతానికీ రోడ్డు వేయిస్తా
- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సద్వినియోగం చేసుకుంటాం
- అమరావతి నుండి హైదరాబాద్ అనుసంధానానికి ప్రతిపాదనలున్నాయి
- మచిలీపట్నంలో రోడ్డు అభివృద్ధికి భూమి పూజ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర

     నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతానికి మెరుగైన రోడ్డు సదుపాయం కల్పించి తీరుతానని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నంలోని మూడు స్తంభాల నేషనల్ హైవే 65లో భాగంగా ఉన్న మూడు స్తంభాల సెంటర్ నుండి కోనేరు సెంటర్ వరకు ఉన్న 1.20 కిలోమీటర్ల రోడ్డు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. సుమారు రూ.1.38 కోట్ల వ్యయంతో 10 మీటర్ల వెడల్పులో రోడ్డును విస్తరించబోతున్నామని తెలిపారు. భవిష్యత్తులో మరింత విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. త్వరలోనే పూర్తి స్థాయి అభివృద్ధి నివేదికను సిద్ధం చేస్తాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.3.50 కోట్ల వ్యయంతో నియోజకవర్గంలో ప్యాచ్ వర్కులతో గుంతలు లేని రోడ్లు చేసి చూపించాం. తర్వాత రూ.8.90 కోట్లతో పలు రోడ్లను అభివృద్ధి చేశాం. మరో రూ.37 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆర్ అండ్ బీ మంత్రి నుండి ఆమోదం లభించింది. ఇప్పటి వరకు సుమారు రూ.50 కోట్ల విలువైన రోడ్డు పనుల్ని నియోజకవర్గంలో చేశాం.

       త్వరలోనే చిన్నాపురం నుండి కమ్మవారి చెరువు రోడ్డు, తాళ్లపాలెం రోడ్డు పనుల్ని కూడా పూర్తి చేస్తాం. మరో రూ.69 కోట్లకు ప్రతిపాదనలు పంపించాం. ఆ నిధులు కూడా వస్తే నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి, ప్రతి ప్రాంతానికి రోడ్డు సదుపాయం కల్పించుకుంటాం. విజయవాడ రోడ్డు విస్తరణకు ప్రజలు కూడా మద్దతుగా నిలుస్తున్నందుకు సంతోషంగా ఉంది. అత్యంత సుందరంగా రోడ్డును నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. మురుగు నీటి వ్యవస్థను మెరుగు పర్చేందుకు రూ.13 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. హ్యామ్, అమృత్ 2.0 వంటి పథకాలతో చేయాల్సిన అభివృద్ధి పనుల్ని పూర్తి చేస్తాం. తాగునీరు, డ్రైనేజీలు, పారిశుధ్య నిర్వహణకు పెద్దపీట వేస్తున్నాం. పంచాయతీ రాజ్ శాఖ నుండి రూ.20 కోట్లు కేటాయించినందుకు ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామాల్లోని డ్రైనేజీని అభివృద్ధి చేస్తాం. 

        మచిలీపట్నం పోర్టును అభివృద్ధి చేసుకుంటున్న నేపథ్యంలో.. రోడ్ల నిర్మాణం కూడా అత్యంత కీలకంగా మారబోతోంది. నాబార్డు నిధులతో అమరావతి-మచిలీపట్నం మధ్య గ్రీన్ ఫీల్డ్ రోడ్లు అభివృద్ధి చేయబోతున్నాం. ఇప్పటికే విజయవాడకు ఆరులైన్ల రోడ్డు మార్గం ఉండగా.. తెలంగాణ ప్రభుత్వం నుండి 12 వరుసల విస్తరణకు కేంద్రానికి ప్రతిపాదనలు అందాయి. అదే సమయంలో మచిలీపట్నం-రేపల్లె-నడికుడి మీదుగా తెలంగాణకు రైలు మార్గం అభివృద్ధికి ప్రతిపాదనలు వచ్చాయి. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ కూడా సిద్ధంగా ఉంది. త్వరలోనే రైల్వే, నేషనల్ హైవే సంస్థలతో సమావేశం నిర్వహించి భవిష్యత్ ప్రణాళికలను ప్రకటిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...