మచిలీపట్నం:
పామర్రు లో నిర్వహిస్తున్న ఆరు ప్రథమ చికిత్స కేంద్రాలను జిల్లా వైద్య శాఖ అధికారి డా పి.యుగంధర్ గారు వారి బృందం తనిఖీ చేసి ఆ కేంద్రాలలో ఐ. వి. సెట్లు, ఐ. పి .బెడ్లు మరియు హై పోటెన్సీ యాంటీబయటిక్స్ గమనించి ఈ మొత్తము ఆరు ప్రథమ చికిత్స కేంద్రాలను తక్షణము మూసి వేయ వలసినదిగా ఆదేశిస్తూ వారికి షోకాజు నోటీసులు ఇచ్చి మూడు రోజులలోగా సంజాయిషీ ఇవ్వవలసిందిగా ఆదేశించారు.
జిల్లాలో గల అందరు ఆర్ఎంపి వైద్యులకు 06, డిసెంబర్ 2025 న మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వారి కార్యాలయము, మచిలీపట్నం నందు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వారు ప్రథమ చికిత్స కేంద్రాలలో చేయవలసిన, చేయకూడని పనుల నిమిత్తము ఒక అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లుగా జిల్లా వైద్య శాఖ అధికారి వారు తెలియజేశారు. కాబట్టి జిల్లాలో గల అందరూ ఆర్ఎంపి వైద్యులు 06, డిసెంబర్ 2025 న మధ్యాహ్నం మూడు గంటలకు జిల్లా వైద్య శాఖ అధికారి వారి కార్యాలయం మచిలీపట్నంకు హాజరు కావలసిందిగా ఆదేశించినారు.
Comments
Post a Comment