మచిలీపట్నం:
ఆంగ్ల భాషలో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థిని అభినందిస్తూ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ స్ఫూర్తినిచ్చే నీతి కథల ఆంగ్ల పుస్తకాన్ని బహుకరించారు.
వివరాల్లోకి వెళితే .........ఈనెల 4 వ తేదీన జిల్లా కలెక్టర్ రాజుపేట లోని నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన సమయంలో 3 వ తరగతి విద్యార్థి షేక్ నాగుల్ మీరా ఫౌండేషన్ లెవెల్ న్యూమరసి (ఎఫ్ ఎల్ ఎన్) పరీక్షలో భాగంగా కలెక్టర్ సమక్షంలో ఆంగ్ల పుస్తకంలోని ఒక కథను ఎలాంటి తప్పులు లేకుండా అనర్గళంగా చదివాడు. దీంతో జిల్లా కలెక్టర్ ఆ విద్యార్థిని అభినందిస్తూ ప్రోత్సాహకంగా ఎసోప్స్ ఫేబుల్స్ పేరుతో స్ఫూర్తినిచ్చే నీతి కథల ఆంగ్ల పుస్తకాన్ని ఆ విద్యార్థికి బహుకరించారు. ఆ పుస్తకాన్ని మండల విద్యాధికారులు దుర్గాప్రసాద్, గురు ప్రసాద్ శనివారం రాజుపేట లో ఆ విద్యార్థికి అందజేసి జిల్లా కలెక్టర్ అభినందించినట్లు తెలిపారు.
Comments
Post a Comment