ఆత్మశుద్ధి లేని యాచారమదియేల?
భాండ శుద్ధిలేని పాకమేల?
చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా?
విశ్వదాభిరామ వినురవేమ.
ఆచారాలు మూఢనమ్మకాలు కాకూడదు. కుండ సరిగా లేకపోతే వంట రుచిగా రాదు. మనసు శుచిగా లేకపోతే నువ్వు పట్టు వస్త్రము కట్టుకొని, దురాలోచన చేస్తూ, ఇతరులకు కీడు తలపెడుతూ, శివుని మీద పాలు పోస్తే శివుడు నీకు మంచి ఫలితం ఇస్తాడా?
Comments
Post a Comment