Skip to main content

స్క్రబ్ టైఫస్ పై మానిటరింగ్

 


మచిలీపట్నం:

      రాష్ట్రంలో ఇటీవలి కాలంలో స్క్రబ్ టైఫస్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో, కృష్ణా జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది అని జిల్లా కలెక్టర్ డి కే బాలాజీ  తెలియచేశారు.

    కలెక్టర్ డి కే బాలాజీ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతుండగా, కృష్ణా జిల్లాలో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు 12 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇవి కూడా ప్రధానంగా వ్యవసాయ పనులు చేసే గ్రామీణ ప్రాంతాల్లో జ్వరంతో వచ్చే కేసుల్లో స్క్రబ్ టైఫస్ గుర్తించబడుతోందన్నారు.

     ప్రభుత్వ ఆసుపత్రులు, CHC/PHCలు నుండి అందుతున్న నివేదికల ఆధారంగా అనుమానిత మరియు ధృవీకరిత కేసులపై ప్రత్యేక ఇంటి ఇంటి సర్వేల ద్వారా మానిటరింగ్ కొనసాగుతోంది.

వ్యాధి గురించి      స్క్రబ్ టైఫస్ అనేది ఒరియెంటియా సుట్సుగాముషి (Orientia tsutsugamushi) అనే బాక్టీరియా వల్ల కలిగే వ్యాధి. ఇది పొలాలు, పొదలు, గడ్డి, చెత్తమేడలు వంటి ప్రదేశాల్లో ఉండే సంక్రమిత “చిగర్” మైట్ కాటు ద్వారా  పిల్లి, ఎలుక వంటి పెంపుడు జంతువుల ద్వారా మనుషులకు సోకుతుంది.

      సాధారణంగా 6–21 రోజుల లోపు (సరాసరి 10-12 రోజుల్లో) జ్వరం మొదలవుతుంది. అధిక జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు, అలసట, కొందరిలో దద్దుర్లు, అలాగే కాటు చోటు వద్ద నల్లటి స్కాట్లాగా కనిపించే “ఎస్కార్” లక్షణంగా కనిపించవచ్చు. 

ప్రభుత్వ చర్యలు     కృష్ణా జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ పరిధిలో అన్ని GGHలు, CHCలు, PHCలు, ఉపకేంద్రాల్లో జ్వర కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టి, అవసరమైన రక్త నమూనాలు సూచనల మేరకు
పరీక్షలకు GGH లో ఉన్న జిల్లా ప్రజా ఆరోగ్య పరీక్షా కేంద్రంకు పంపుతోంది.

         జ్వర క్లినిక్లు, అవుట్పేషెంట్ విభాగాల్లో స్క్రబ్ టైఫస్పై క్లినికల్ అనుమానం కలిగిన రోగులకు వెంటనే తగిన యాంటీబయాటిక్ చికిత్స ప్రారంభించేందుకు మార్గదర్శకాలు జారీ చేయబడ్డాయి. ప్రతి ఆస్పత్రులలో డాక్సిసైక్లిన్, అజిత్రోమైసిన్ తదితర మందులు సమృద్ధిగా నిల్వ ఉంచి, నిర్ధారణ పరీక్షా సదుపాయాలు బలోపేతం చేశారు. MLHP, ANMలు, ASHAలు సిబ్బంది ద్వారా గ్రామీణ ప్రజలకు స్క్రబ్ టైఫస్ లక్షణాలు, వ్యాప్తి, నివారణ చర్యలపై IEC కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు   పంట పొలాలు, గడ్డి, పొదలు ఉన్న ప్రదేశాల్లో పని చేసే సమయంలో పూర్తి చేతి గల చొక్కా, పూర్తి కాలువున్న ప్యాంటు, బూట్లు వంటి రక్షణ దుస్తులు ధరించాలి.దోమల / పురుగుల కాటు నివారణకు మశకనిరోధక లోషన్లు, క్రీములు, స్ప్రేలు (insect/mosquito repellents) వాడాలి.పొదలు, చెత్త, గడ్డి దగ్గర లేదా బయట పందిరి మీద, నేలపై బోర్లా నిద్రించకుండా ఉండాలి; రాత్రి సమయంలో తప్పనిసరిగా మస్కిటో నెట్ ఉపయోగించాలి. 3 రోజులకు మించి జ్వరం కొనసాగితే, ముఖ్యంగా దద్దుర్లు లేదా చర్మంపై నల్లటి పూత (ఎస్కార్/ESCHAR) కనిపిస్తే, స్వయం మందులు తీసుకోకుండా సమీప ప్రభుత్వ ఆస్పత్రి కు వెంటనే వెళ్లాలి.

       గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు జ్వరం వచ్చిన వెంటనే దగ్గరి PHC/CHC లేదా ఆసుపత్రిలో వైద్యులను సంప్రదించాలి. స్క్రబ్ టైఫస్ ముందుగానే గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం నివారించవచ్చు. కృష్ణా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండి పై సూచనలు పాటించాల్సిందిగా గౌరవ కలెక్టర్ గారు విజ్ఞప్తి చేశారు.

      జ్వరం వచ్చినప్పుడు వెంటనే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను ఆశ్రయించాలని స్క్రబ్ టైఫస్ ముందస్తుగా గుర్తించి సమయానికి యాంటీబయాటిక్
చికిత్స  ప్రారంభిస్తే పూర్తిగా నయం అయ్యే వ్యాధి అని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి పి. యుగంధర్ మార్గదర్శకాలు జారీ చేసారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...