మచిలీపట్నం:
పెనమలూరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పరిష్కరించి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయుటకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
మంగళవారం సాయంత్రం పెనమలూరు మండలం ఫోరంకిలోని ద్వారకా కన్వెన్షన్ లో జిల్లా కలెక్టర్ శాసనసభ్యులు బోడే ప్రసాద్ తో కలసి పెనమలూరు నియోజకవర్గ అభివృద్ధి సమీక్షా సమావేశం నిర్వహించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాలకు సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా విజన్ యాక్షన్ యూనిట్ రూపొందించిందన్నారు.
జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించి కీలక పనితీరు సూచికలు( కీ పర్ఫామెన్స్ ఇండికేటర్స్) సాధించుటకు నియోజకవర్గ వారీగా శ్రద్ధ చూపుతున్నామన్నారు.
ఏ ఏ అభివృద్ధి పనులు ఏ ఏ స్థితిలో ఉన్నాయో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఎలా పరిష్కరించాలో వాటన్నిటి పైన ఈ సందర్భంగా చర్చించడం జరిగిందన్నారు. అన్ని సమస్యలను పరిష్కరించి నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి అవసరమైన చర్యలు చేపడతామన్నారు.
తదనంతరం పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ శాఖలతోనూ కలసి సమీక్షించామని, దీర్ఘకాలిక సమస్యలు అయినటువంటి భూ సమస్యల పైన దృష్టి పెట్టామన్నారు. ఉయ్యూరు డివిజన్లో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి సంబంధించి స్థలం ఇస్తామని దాత సజ్జ వెంకటేశ్వరరావు ముందుకు వచ్చారని, నిధులు ఏ విధంగా సమకూర్చుకోవాలో కార్యాలయాలు ఎలా నిర్మించాలో నిర్మాణం ఎలా పూర్తి చేయాలో చర్చించామన్నారు.
తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో ప్రజల సహకారంతో ఎక్కువగా పన్నులు వసూలు చేసి ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలను మొదటి ప్రాధాన్యతగా కల్పించాలని అధికారులకు సూచించామన్నారు. ముస్లిం సోదరులకు ఈద్గా కాంపౌండ్ ఏర్పాటుకు చర్చించామన్నారు. మురుగునీటి వ్యవస్థ సమస్యగా ఉందని ఆక్రమణలను తొలగించుటకు అక్కడ ఉన్నవారికి ప్రత్యామ్నాయంగా స్థలం కేటాయించేందుకు ప్రధానంగా భూమి సమీకరణపై చర్చించామన్నారు.
అమృత 2.0 కింద కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇంటింటికి తాగునీటి అవసరాలు తీర్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించామన్నారు.
మరికొన్ని సమస్యలను కూడా నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని ఆదేశించామన్నారు.
ఈ సమావేశంలో ఉయ్యూరు ఆర్డిఓ బిఎస్ హేలా షారోన్, డ్వామా పిడి శివ, డిఆర్డిఏ పిడి హరిహరనాథ్, జడ్పీ సీఈవో కే కన్నమ నాయుడు, గృహ నిర్మాణ సంస్థ జిల్లా అధికారి పోతురాజు, ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ ఈ సోమశేఖర్, ఆర్ అండ్ బి ఈ లోకేష్, పౌరసరఫరాల సంస్థ డిఎం శివరాం ప్రసాద్, జిల్లా ఉద్యాన అధికారి జే జ్యోతి, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ పద్మావతి, తాడిగడప మున్సిపల్ కమిషనర్ నజీర్, నియోజకవర్గంలోని తహసిల్దార్ లు, ఎంపీడీవోలు తదితర అధికారులు పాల్గొన్నారు.
Comments
Post a Comment