చిన్న చోరీ కాదు.... మహా పాపం.... పరకామణి కేసులో నిందితుడు రవికుమార్ కన్నీరు..... తెర వెనుక వైకాపా ఆస్తి రాజీ డ్రామా.
మచిలీపట్నం :
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్, బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పి. వి. ఫణి కుమార్, గొడుగు పేట వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్, వడ్లమూడి లక్ష్మీనరసింహారావు, చల్లారస్తా వేణుగోపాల స్వామి దేవస్థానం చైర్మన్, ధూళిపాళ్ల శ్రీరామచంద్రమూర్తి, జగన్నాధపురం జగన్నాథ స్వామి దేవస్థానం కమిటీ సభ్యుడు తంగిరాల మిధున వ్యాస్, టిడిపి నాయకుడు, హేమాద్రి వెంకట లీలా ప్రసాద్ లు జగన్మోహన్ రెడ్డి పై మండిపడి ఆదివారం తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం నియోజకవర్గం కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో తిరుమల పరకామణి లో కోట్లాది రూపాయల ఆస్తి దోచుకునేందుకు సిద్ధపడ్డారంటే జగన్మోహన్ రెడ్డి వారి పరివారం ఇంకెంత సంపాదించి ఉంటారని ప్రశ్నించారు. దేవుడి ఆలయాల పవిత్రతపై జగన్మోహన్ రెడ్డికి లెక్కలేదని ఆగ్రహించి, జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు భక్తుల మనోభావాలపై దాడేనని వారు వ్యాఖ్యానించారు. పరకామణిలో దొంగతనాన్ని తప్పు కాదని సమర్థించడం నేరం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరస్తుల్ని వెనకేసుకొస్తాను అంటూ సమాజానికి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారని నిలదీశారు.
పవిత్ర శ్రీవారి ఆలయంలో ప్రతి అంశంలోనూ భక్తుల సెంటిమెంట్ ముడిపడి ఉంటుంది అన్నారు. భక్తులు ఇచ్చిన కానుకలు, ముడుపులు కొట్టేసిన దొంగలతో సెటిల్మెంట్ ఏమిటి? అని ప్రశ్నించారు. శ్రీవారి హుండీలో చోరీపై జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై అన్ని వర్గాల ప్రజలలోను తీవ్ర ఆవేదన కనిపిస్తోంది అన్నారు. వర్గాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను తప్పు పడుతున్నారని వారు స్పష్టం చేశారు.
దేవుడి హుండీలో చోరీని సెటిల్ చేయటానికి జగన్మోహన్ రెడ్డి ఎవరని నిలదీశారు. కోట్ల మంది భక్తుల విశ్వాసాలు దెబ్బతీసేలా పరకామణి విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఘోర పాపం కాదా? అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చిన్న చోరీ కాదు, నేను మహా పాపం చేశాను అంటూ పరకామణి కేసు నిందితుడు రవికుమార్ సంచలన వ్యాఖ్యలు చూస్తే జగన్మోహన్ రెడ్డి, వారి పరివారం తిరుమలను ఏ విధంగా దోచుకున్నారో అర్థం అవుతుంది అన్నారు.
రవికుమార్ పశ్చాతాపంపై భక్తులకు, ప్రజలకు తీవ్రమైన సందేహాలు తలెత్తుతున్నాయి. దీనికి ప్రధాన కారణం కేసు నడిచిన విధానం మరియు ఆస్తుల వ్యవహారం, నిందితుడిని వైకాపా నాయకులు బెదిరించి 160 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను వారి బినామీల పేరున వ్రాయించుకున్నారు అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి అన్నారు. చోరీతో కోట్ల ఆస్తులు అర్జించిన వైకాపా నేతల హేయమైన మహా పాపం పై వైకాపా నేతలు ఎందుకు నోరు విప్పడం లేదు అని ప్రశ్న శ్రీవారి విషయంలో చేసిన మహా పరాధానికి, తప్పు మీద తప్పులు, హత్య అన్ని బయటకు రావాల్సిందే, శిక్ష అనుభవించాల్సిందే అన్నారు. గొడుగు పేట శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానానికి మంత్రి కొల్లు రవీంద్ర ఆదాయం సమకూర్చితే, మాజీ మంత్రి పేర్ని నాని తన రాజకీయ లబ్ధి కోసం మాట్లాడాడే, ఇప్పుడు పరకామణి కేసులో మాజీ మంత్రి పేర్ని నాని ఎందుకు మాట్లాడడం లేదు అని ప్రశ్నించారు.
గత వైసీపీ ప్రభుత్వంలో హిందూ దేవుళ్ళ విగ్రహాలను ధ్వంసం చేసి, హిందువుల మనోభావాలను ఏ విధంగా వైసిపి పాలకులు దెబ్బతీశారో ప్రజలు గ్రహించాలి అన్నారు.
Comments
Post a Comment