జిల్లా వ్యాప్తంగా స్క్రబ్ టైఫాస్ కేసులపై ప్రత్యేక దృష్టి : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పి యుగంధర్
మచిలీపట్నం, డిసెంబర్ 2:
రాష్ట్రంలో ఇటీవల కాలంలో స్క్రబ్ టైఫాస్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో కృష్ణా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పి యుగంధర్ స్పష్టం చేశారు. స్క్రబ్ టైఫాస్ ముందస్తుగా గుర్తించి సమయానికి యాంటీబయాటిక్ చికిత్స ప్రారంభిస్తే పూర్తిగా నయం అయ్యే వ్యాధి అని పి యుగంధర్ తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా స్క్రప్ టైఫేస్ కేసులు పెరుగుతుండగా కృష్ణా జిల్లాలో అక్టోబర్ నుంచి నవంబర్ వరకు వరకు ఆరు పాజిటివ్ కేసులు నమోయినట్లు ఇవి కూడా ప్రధానంగా వ్యవసాయ పనులు చేసే గ్రామీణ ప్రాంతంలో జ్వరంతో వచ్చే కేసుల్లో స్క్రబ్ టైఫాయిస్ గుర్తించబడుతుంది అని తెలిపారు.
వ్యాధి గురించి స్క్రబ్ టైఫాస్ అనేది ఓరియంటీయా సతసుగాముషి (orientia tsutsugamushi) అనే బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధి. ఇది పొలాలు, పొదలు, గడ్డి, చెత్త మేడలు వంటి ప్రదేశాల్లో ఉండే సంక్రమిత చిగర్ మైట్ కాటు ద్వారా మరియు పిల్లి ఎలుక వంటి పెంపుడు జంతువుల ద్వారా మనుషులకు సోకుతుంది. సాధారణంగా ఆరు నుండి 21 రోజుల్లోపు జ్వరం మొదలవుతుంది. అధిక జ్వరం, తలనొప్పి శరీర నొప్పులు, అలసట కొందరిలో దద్దుర్లు అలాగే కాటు చోటు వద్ద నల్లటి స్కాట్లాగా కనిపించే ఎస్కార్ లక్షణంగా కనిపించవచ్చు.
కృష్ణాజిల్లా వైద్య ఆరోగ్యశాఖ జ్వర కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టి అవసరమైన రక్తం నమూనాలు రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు పరీక్షలకు మచిలీపట్నం సర్వజన ఆసుపత్రి లో ఉన్న జిల్లా ప్రజా ఆరోగ్య పరీక్షా కేంద్రంకు పంపుతుంది. జ్వర క్లినిక్ లో ఔట్ పేషెంట్ విభాగాల్లో క్లినికల్ అనుమానం కలిగిన రోగులకు వెంటనే తగిన యాంటీబయాటిక్ చికిత్స ప్రారంభించేందుకు మార్గదర్శకాలు జారీ చేయబడ్డాయి.
మూడు రోజులకు మించి జ్వరం కొనసాగితే ముఖ్యంగా దద్దుర్లు లేదా చర్మంపై నల్లటి పూత కనిపిస్తే స్వయం మందులు తీసుకోకుండా సమీప ప్రభుత్వ ఆసుపత్రికి వెంటనే వెళ్లాలి. గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు జ్వరం వచ్చిన వెంటనే దగ్గరలోని ఆసుపత్రిలో వైద్యులను సంప్రదించాలి. ముందస్తుగానే గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం నివారించవచ్చు అని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి పి యుగంధర్ తెలియజేశారు.
Comments
Post a Comment