Skip to main content

అనధికార లేఅవుట్లను, ఆక్రమణలను తొలగించేందుకు కఠిన చర్యలు: జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ



మచిలీపట్నం:

జిల్లాలోని పట్టణ ప్రాంతాలలో అనధికార లేఅవుట్లను, ఆక్రమణలను తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. 

మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో మునిసిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించి వ్యర్థ పదార్ధాల తొలగింపు, ఇంటింటి చెత్త సేకరణ, ఇంటిలోనే కంపోస్ట్ తయారీ, పెరటి తోటల పెంపకం, ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ నిషేధం అమలు, చెత్తను వేరుపరచుట, నీటి సరఫరా, పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణం తదితర అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో అనధికార ఆక్రమణలను లేఅవుట్లను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం మంచి అవకాశం కల్పిస్తూ మార్చి వరకు గడువు ఇచ్చిందన్నారు. క్రమబద్దీకరణ కోసం దరఖాస్తులు చాలా తక్కువగా రావడంతో జిల్లా కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ వెంటనే ఆక్రమణదారుల జాబితా పరిశీలించి అందరికి నోటీసులు జారీ చేయాలన్నారు. ఎవరైనా స్పందించకపోతే జెసిబి లతో నిర్దాక్షిణ్యంగా తొలగించేందుకు సిద్ధం కావాలని కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు 

మచిలీపట్నం డంపింగ్ యార్డ్ లోని పాత వ్యర్థాలను పూర్తిస్థాయిలో తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. చెత్త నుండి కాంపోస్టు తయారు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మచిలీపట్నంలోని నారాయణపురం, గుడివాడలోని ధనియాల పేట బేతవోలు లో త్వరితగతిన పట్టణ ఆరోగ్య కేంద్రాలను నిర్మాణం పూర్తి చేయాలన్నారు. తాడిగడపలో మంజూరైన కానూరు ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి సత్వరమే స్థలం గుర్తించాలన్నారు 

 పెడనలో 3 సివేజి ట్రీట్మెంట్ ప్లాంట్లు, ఉయ్యూరులో 2 ట్రీట్మెంట్ ప్లాంట్లకు అవసరమైన స్థలాలను వెంటనే గుర్తించాలన్నారు 
ఈ సమావేశంలో మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, సహాయ కమిషనర్ గోపాల్ రావు, గుడివాడ ఉయ్యూరు తాడిగడప పెడన మున్సిపల్ కమిషనర్లు మనోహర్, రామారావు, నజీర్, రామాంజనేయులు జిల్లా ప్రజారోగ్య ఇంజనీరింగ్ అధికారి ప్రవీణ్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...