Skip to main content

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా నివాళులు

మచిలీపట్నం:
   మంగళవారం మాజీ  ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా  మచిలీపట్నం మున్సిపల్ ప్రధాన పార్కు వద్ద గల పీవీ కాంస్య విగ్రహానికి విగ్రహ కమిటీ సభ్యులు, పలువురు పట్టణ ప్రముఖులు  ఘన నివాళులర్పించారు..

ఈ కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ మాజీ చైర్మన్, మోటమర్రి వెంకట బాబా ప్రసాద్ మాట్లాడుతూ.....

స్వర్గీయ పీవీ నరసింహారావు తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణం అన్నారు. విదేశాల్లో తాకట్టు పెట్టిన మన దేశభంగారాన్ని తిరిగి తీసుకువచ్చి దేశ ఆర్థిక పరిపుష్టికి పునాదులు వేసిన మహనీయుడు స్వర్గీయ మన ఏకైక తెలుగు ప్రధాని పీవీ నరసింహారావు అన్నారు.

ప్రముఖ వైద్యులు బృందావనం ధన్వంతరి ఆచార్య మాట్లాడుతూ..... స్వర్గీయ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అప్పట్లో మైనార్టీ ప్రభుత్వాన్ని తన మేధస్సుతో ఐదు సంవత్సరాలు దిగ్విజయంగా పరిపాలించి దేశ ఆర్థిక పరిస్థితికి మెరుగులు దిద్దిన మహనీయుడు అన్నారు. 

బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్,  పీవీ విగ్రహ కమిటీ ప్రధాన కార్యదర్శి, పి. వి. ఫణి కుమార్ మాట్లాడుతూ.....   పివి తన సొంత భూమి 1100 ఎకరాలు దేశంలోని పేద ప్రజలకు పంపిణీ చేసిన మహనీయుడు అన్నారు. క్రమశిక్షణతో ముందుకు సాగిన ఆయన పాలనా దక్షతను నేటి రాజకీయ నాయకులు, యువత స్ఫూర్తిగా తీసుకోవాలి అన్నారు.

వేణుగోపాలస్వామి దేవస్థానం చైర్మన్, బిజెపి సీనియర్ నాయకుడు ధూళిపాళ్ల శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ..... ప్రపంచ శిఖరాగ్ర మహాసభల్లో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఆనాడే బట్టబయలు చేసిన ఘనత స్వర్గీయ పీవీ నరసింహారావు దే నన్నారు. 

 కాశ్మీర్ సమస్యపై  తన సొంత పార్టీ వారిని కాకుండా ప్రతిపక్ష పార్టీ వారిని పంపించి  వాజ్పేయి ద్వారా పాకిస్తాన్ వాదాన్ని ఎండ కట్టే విధంగా ప్రతిపక్ష పార్టీని కూడా గౌరవించిన ఘనుడు స్వర్గీయ పీవీ  అన్నారు. 
మన తెలుగు ప్రధాని జీవిత విశేషాలు భావితరాలకు తెలిసేలా చేయవలసిన బాధ్యత మనందరిపై ఉంది అన్నారు.

ఈ కార్యక్రమంలో అర్బన్ బ్యాంక్ డైరెక్టర్, సూరిశెట్టి హరికృష్ణ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, బొడ్డు నాగరాజు, ప్రముఖ న్యాయవాది పుప్పాల ప్రసాద్, బ్రాహ్మణ సంఘం నాయకులు, ఎం. సుబ్రహ్మణ్యం, నిమ్మగడ్డ శ్రీధర్, వి ఎస్ ఎస్ ఆర్ శర్మ,
 బావ తరంగణి ఎడిటర్ భవిష్య, ఆర్ వి ఎస్ మురళీధర్, లక్క వజ్జుల రామకృష్ణ, తంగిరాల మిధున వ్యాస్, గొర్తి శర్మ, కొండా ప్రసాద్
తదితరులతోపాటు విగ్రహ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...