Skip to main content

సమస్యలకు మీకోసం కార్యక్రమం ద్వారా చక్కటి పరిష్కారం..... ఏఎస్పి సత్యనారాయణ

మచిలీపట్నం :

  జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ వి .విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు సోమవారం ఏఆర్ అడిషనల్ ఎస్పి బి.సత్యనారాయణ మీకోసం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలు మూలల నుండి వచ్చిన, ఫిర్యాదుదారులవద్ద నుండి అర్జీలు అందుకుని, వాటిని సకాలంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మెత్తం 45 అర్జీలు స్వీకరించగా స్వీకరించిన అన్ని ఫిర్యాదులను సంబంధిత పోలీసు అధికారులకు పరిష్కారం నిమిత్తం పంపించారు.... అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ.

 మీకోసం లో వచ్చిన ఫిర్యాదుల వివరాలు...

యనమలకుదురు నుండి ఒక మహిళ వచ్చి తన భర్త 2014 లో మరణించాడని, అప్పటి నుండి అత్తవారింటి వద్ద ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నామని, భర్త లేడనే నెపంతోఆడపడుచు, ఆమె భర్త, అత్తింటి వారు, అనేక రకాలుగా హింసించడం చేస్తున్నారని, 2013, ఏప్రియల్ నెలలో తన అత్తగారు కూడా కాలం చేయగా వీరి ఆగడాలకు అడ్డు అదుపూ లేదని, పిల్లలతో సహా ఇంటినుండి గెంటి వేసారని , న్యాయం చేయమని ఫిర్యాదు.

 మచిలీపట్నం నుండి ఒక మహిళ వచ్చి తనకు చల్లపల్లి మండలం కు చెందిన వ్యక్తితో వివాహం జరిగిందని, కొంతకాలం కాపురం సజావుగానే సాగిందని, ఆడపిల్ల పుట్టిందనే కారణం గా రెండు సంవత్సరాలా నుండి పుట్టింటి వద్దే ఉంటూ మానసికంగా అనేక ఇబ్బందులు పడుతున్నానని, న్యాయం చేయమని ఫిర్యాదు.

 బంటుమిల్లి కి చెందిన ఒక వ్యక్తి వచ్చి తాను నివాసం ఉంటున్న ఇంటి పక్క సరిహద్దు దారుడు అతని కుమారుడు కలసి పాత సరిహద్దు గొడవల నేపథ్యంలో, అనేక ఇబ్బందులకు గురి చేస్తూ, దాడులకు దిగుతూ, చంపుతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని, రక్షణ కల్పించి న్యాయం చేయమని ఫిర్యాదు.

   కానూరుకు చెందిన ఒక మహిళ వచ్చి తన భర్త మరణించాడని, కుటుంబ పోషణ నిమిత్తం ఆటో కన్సల్టెన్సీ వ్యాపారం నిర్వహిస్తున్నానని, అందు నిమిత్తం ముగ్గురి దగ్గర నగదు అప్పుగా తీసుకోగా, వారు అధిక వడ్డి వసూలు చేయడమే కాకుండా దుర్భాషలాడుతూ అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని, రక్షణ కల్పించమని ఫిర్యాదు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...