Skip to main content

అభినయ నాటక పుస్తకావిష్కరణ



మచిలీపట్నం :

      స్థానిక మహతి కళావేదిక లో భావతరంగిణి సంస్థ ఆధ్వర్యంలో భవిష్య రచించిన అభినయ సాంఘిక నాటక పుస్తకావిష్కరణ ఆదివారం సాయంత్రం జరిగింది.
  
       ప్రపంచ తెలుగు రచయితల సంఘ అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు, సాహిత్య వేత్త డాక్టర్ ధన్వంతరి ఆచార్య, ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ, భావ తరంగిణి గౌరవాధ్యక్షులు కె. కృష్ణమోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఆవిష్కరణ అనంతరం ప్రేక్షకులే సమీక్షకులు అని రచయిత ప్రకటించి వెంటనే అభినయ నాటక ప్రదర్శన నిర్వహించడం వినూత్నమైన ఆలోచన. ప్రముఖ సాహితీవేత్త కొప్పరపు నారాయణ మూర్తి, చార్టర్డ్ అకౌంటెంట్ బి.వి.వి.సత్యనారాయణ, రచయిత్రి గుడిపూడి రాధికారాణి, తెలుగు భాషా సమాఖ్య కార్యదర్శి అప్పినేడి పోతురాజు, ఆర్టీసీ డి.ఎం.పెద్దిరాజు, ప్రముఖ గాయని కాళీపట్నపు ఉమ, కవయిత్రి మాదిరాజు శివలక్ష్మి తదితరులు అభినయను వీక్షించి సమీక్షించారు. సాహితీ ప్రియులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

అద్భుతం అభినయ నాటకం

స్థానిక మహతి కళావేదికలో ఆదివారం సాయంత్రం ప్రదర్శించిన అభినయ సాంఘిక నాటకం పలు ప్రత్యేకతలతో ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది.
భావ తరంగిణి సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో నాటక రచయిత భవిష్య దర్శక నిర్వాహణలో ప్రదర్శించిన అభినయ నాటకం అధ్యంతం ఆసక్తికరంగా సాగింది.  నాటకం మొదటి నుంచి చివరి వరకు మన కళా రంగం విశిష్టత ప్రాధాన్యత అవసరం అలాగే మన విలువైన సాహితీ సంపదను పరిరక్షించుకోవాలి అనే కథాంశంతో జరిగింది. కళాకారులకు ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని కలిగించేలా నాటకం ఉందని పలువురు తమ భావాన్ని వ్యక్తం చేశారు 
     అలాగే నాటకంలో మొదట పల్లె వాతావరణం ఒక వృద్ధురాలు పాటని ఏ ఐ ద్వారా పాడిచ్చి ప్రదర్శించారు.

       "పల్లె అందాలన్నీ పోయే నగరాల నాగరికత వచ్చే  రోళ్ళు పోయే రోకళ్ళు పోయే కోడళ్ళ కాళ్ళకేమో కీళ్ల నిప్పులాయే... "జానపద తరహాలోని ఈ పాటను ఏఐ ద్వారా పాడించి అక్కడ ప్రదర్శనలో అభినయించారు .

      మొత్తం నాటకంలో పాటలు కూచిపూడి నాట్యము  వయోలిన్ వాయిద్యం అన్ని ఉండటంతో నవరసభరితంగా సాగింది.  మరో విశేషమేమంటే నాటకంలో పి .శాంతి 80 ఏళ్ల నాయినమ్మ గా 50 ఏళ్ల తల్లి గా 20 ఏళ్ల హీరోయిన్ గా త్రిపాత్రాభినయం చేయటం హైలైట్ గా ఉంది.  మరో పాత్రధారి రావినూతల సత్యనారాయణ పద్మనాభరావు పాత్రధారిగా, పాత్రికేయుడుగా, పాల అబ్బాయిగా మూడు పాత్రలను చక్కగా పోషించారు.

        ఇంకా నాటకంలో దండిభోట్ల దత్తాత్రేయ శర్మ ప్రముఖ నాట్యాచార్యులు పాత్రధారిగా, యల్లాప్రగడ శ్రీరామ్ సినీ డైరెక్టర్ గా, ఆర్ వెంకటేశ్వరరావు హాస్య పాత్రధారిగా, ప్రముఖ వైద్యులు డాక్టర్ ధన్వంతరి డాక్టరు పాత్ర మరియు సాహితీవేత్త పాత్రధారిగా, అద్దేపల్లి సత్య మల్లికార్జున ప్రసాద్ హీరోగా, కోసూరు ఈశ్వరరావు కవి పాత్రధారిగా, వై హరిణి కూచిపూడి నాట్య కళాకారునిగా, జె.కృష్ణ కౌండిన్య దత్ బాల నటుడుగా తమ తమ పాత్రలకు న్యాయం చేకూర్చి నాటకాన్ని విజయవంతం చేశారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...