కృష్ణా తరంగ్ ఛాంపియన్ సిద్ధార్థ్ కాలేజ్ - రన్నరప్ గా నలందా కాలేజ్
మచిలీపట్నం:
కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కృష్ణా తరంగ్ 2025 ఓవరాల్ ఛాంపియన్ గా విజయవాడ పిబి సిద్ధార్థ కాలేజ్ గెలుచుకుంది. రన్నరప్ గా విజయవాడ నలందా కాలేజ్ నిలిచింది. గత మూడు రోజులుగా స్థానిక కృష్ణా విశ్వవిద్యాలయం ప్రాంగణం లో నాలుగు విభాగాలకు సంబంధించి ఇరవై ఎనిమిది కేటగిరీల లో పోటీలు నిర్వహించగా శనివారం ముగింపు కార్యక్రమం జరిగింది. విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె. రాంజీ అధ్యక్షతన జరిగిన సభలో రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ చైర్మన్ కొనకళ్ళ నారాయణ రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విశిష్ట అతిధి గా సామాజిక వేత్త, బీజేపి అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ పాల్గొన్నారు.
కృష్ణా తరంగ్ 2025 పోటీల విజేతలకు అతిథుల చేతుల మీదుగా షీల్డ్, ప్రశంసా పత్రాలు అందచేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ఆచార్య సిహెచ్ అప్పారావు, పుదుచ్చేరి విశ్వవిద్యాలయం ఆచార్యులు, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఆర్. విశ్వనాథన్, రెక్టర్ ఆచార్య ఎంవి బసవేశ్వరరావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎన్ ఉష, కృష్ణా తరంగ్ కన్వీనర్ ఆచార్య దిలీప్, పలువురు ఆచార్యులు, బోధనేతర సిబ్బంది, జిల్లా నలుమూలల నుండి వచ్చిన విద్యార్ధుల కోలాహలం మధ్య కార్యక్రమం సందడిగా జరిగింది.
Comments
Post a Comment