...
కృష్ణాజిల్లా న్యాయ సేవధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి రామకృష్ణయ్య.....
మచిలీపట్నo:
అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం పురస్కరించుకుని బుధవారం మచిలీపట్నం లేడీ యాంప్తిల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జిల్లా న్యాయశాఖ మరియు ఎన్ఎస్ఎస్ (NSS )యూనిట్ సంయుక్త ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు మరియు విద్యార్థులు తో ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి రామకృష్ణయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రసాదించిన మానవ హక్కుల పరిరక్షణ కోసం న్యాయస్థానాలు దేశవ్యాప్తంగా పనిచేస్తున్నాయని అన్నారు .జిల్లా స్థాయిలో జిల్లా జడ్జి హోదా కలిగిన అధికారి మానవ హక్కుల కోర్టుకు న్యాయమూర్తిగాను ,రాష్ట్రస్థాయిలో హైకోర్టు జడ్జి హోదా కలిగిన న్యాయమూర్తి జాతీయ స్థాయిలో , సుప్రీంకోర్టు హోదా కలిగిన న్యాయమూర్తులు మానవ హక్కులకోర్టుకు చైర్మన్లు గా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎక్కడైనా పోలీస్ స్టేషన్లో గాని ఇతర ప్రాంతాల్లో గాని పౌరులు హక్కులకు భంగం కలిగినప్పుడు తగిన ఆధారాలతో మానవ హక్కుల కోర్టు ఆశ్రయించవచ్చని అన్నారు. ఏ విధమైన కోర్టు ఫీజులు లేకుండా తగిన పరిహారం పొందే అవకాశం ఉందని తెలియజేశారు .ప్రతి పౌరుడు భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు బాధ్యతలు తెలుసుకోవాలని అన్నారు
.కళాశాల ప్రిన్సిపాల్ P. లక్ష్మి మాట్లాడుతూ ముఖ్యంగా విద్యార్థులు తమ విద్యార్థి దశనుండే చట్టాలు పట్ల అవగాహన పెంచుకోవాలని అన్నారు .తొలుత న్యాయమూర్తి లేడీ యాంప్తిల్ కళాశాల నుండి మానవ హక్కుల పరిరక్షణ తెలియజేస్తూ విద్యార్థినిలు అధ్యాపకులతో ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమం లొ NSS ప్రోగ్రాం అధికారి లంకిశెట్టి హరనాధ్ బాబు. అధ్యాపకులు సుందర లక్ష్మి, విజయశ్రీ ,మృదుల ,రత్న ,సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment