మచిలీపట్నం:
దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన సైనికుల కుటుంబాల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరు విరాళాల రూపంలో సహాయం అందించేందుకు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు.
సాయుధ దళాల పతాక దినోత్సవం పురస్కరించుకొని సోమవారం నగరంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి కే కళ్యాణి వీణ ఆధ్వర్యంలో మచిలీపట్నం, పెడన మాజీ సైనికుల సంక్షేమ సంఘం సభ్యుల సమక్షంలో ఎన్సిసి క్యాడేట్లు జిల్లా కలెక్టర్కు గౌరవ వందనం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మన దేశ సరిహద్దుల్లో ఎంతో శ్రమకోర్చి సైనికులు పోరాడుతున్నారని, వారి త్యాగం వలన వలన మనమంతా సురక్షితంగా ఉండగలుగు తున్నామన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు తమ వంతు ఆర్థిక సహాయం అందించి సైనిక సంక్షేమ కుటుంబాలను ఆదుకోవాలన్నారు
అనంతరం మీకోసం సమావేశం మందిరంలో స్టికర్లను ఆవిష్కరించి జిల్లా అధికారులు సిబ్బంది అందరికీ సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్టిక్కరింగ్ చేయించారు. జిల్లా కలెక్టర్ తోపాటు సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, డిఆర్ఓ కే చంద్రశేఖర రావు కె ఆర్ ఆర్ సి ఎస్జిసి శ్రీదేవి, ఆర్డిఓ స్వాతి జిల్లా అధికారులు వారికి తోచిన విరాళాలు అందజేశారు. అనంతరం అందరూ కలిసి భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు పెద్ద ఎత్తున చేశారు.
ఈ కార్యక్రమంలో సైనిక సంక్షేమ శాఖ కార్యాలయ పర్యవేక్షకులు ఈశ్వరరావు మచిలీపట్నం, పెడన మాజీ సైనికుల సంక్షేమ సంఘాల సభ్యులు, ఎన్సిసి క్యాడేట్లు పాల్గొన్నారు.
Comments
Post a Comment