మచిలీపట్నం :
భారతదేశంలో హిందూ సాంప్రదాయ వివాహంతో ముడిపడిన బంధంతో భార్య భర్తలు ఇరువురు నూరేళ్లు కలిసి జీవిస్తారు...... ఆ వివాహ బంధాన్ని ఎంతో గౌరవిస్తారు....
గుడివాడకు చెందిన సంగీతం టీచర్ మండవల్లికి చెందిన ఎస్ జి టి టీచర్ ఉపాధ్యాయ వృత్తి లో పవిత్ర వివాహ బంధాన్ని అపహాస్యం చేశారని తెలుస్తోంది... ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన.
సేకరించిన సమాచారం ప్రకారం కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన అన్నపూర్ణాదేవి అనే మహిళ కైకలూరులో ఓ ప్రైవేట్ కళాశాలలో టీచర్ గా ఉద్యోగం చేస్తూ అక్కడ రాఘవేంద్రరావు అనే వ్యక్తితో ప్రేమలో పడింది. అయితే అతను నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కండిషన్ పెట్టాడు. దీనితో ఆమె పట్టుదలతో తిరుపతిలో కోచింగ్ తీసుకొని ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. రాఘవేంద్రరావు కు కూడా ప్రభుత్వ టీచర్ ఉద్యోగం వచ్చింది.
అన్నపూర్ణ కు ప్రభుత్వ ఉద్యోగం వచ్చాక రాఘవేంద్రరావును పెళ్లి చేసుకోవాలని కోరగా ఇద్దరు కలిసి కొన్ని సంవత్సరాలు సహజీవనం చేశారు. ఈ సహజీవనానికి గుర్తుగా ఒక కుమార్తె జన్మించింది. దీనితో రాఘవేంద్రరావు అన్నపూర్ణ ఇరువురు పెళ్లి చేసుకున్నారు. ఇరువురి మధ్య చట్టబద్ధంగా వివాహం జరిగిందో లేదో అనే అనుమానాలు కూడా లేకపోలేదు. అయితే ప్రేమించి పెళ్లి చేసుకోవడం లో ఏముంది అని అనుకుంటున్నారా? ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది.
అన్నపూర్ణ తిరుపతి కోచింగ్ లో ఉన్న సమయంలో ఓ వ్యక్తితో పరిచయం అయ్యి, అక్కడ కూడా ఒక ప్రేమాయణం నడిపింది అని తన సొంత భర్త తిరుపతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీనిపై తిరుపతి మహిళ పోలీసులు కేసు నమోదు చేశారు. రాఘవేంద్రరావు కు సైతం కొన్ని సంవత్సరాల క్రితమే ఇంకో మహిళతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. అన్నపూర్ణ, రాఘవేంద్రరావుకు ఇద్దరికీ రెండో వివాహమే.
భార్య భర్తలు ఉండే విడాకులు పొందకుండా వివాహం చేసుకోవడం చట్టరీత్యా నేరం. నేరమని తెలిసినా రెండో వివాహం చేసుకోవడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. ఒకరికొకరు గతంలో వివాహం జరిగిందని చెప్పకుండా ఇద్దరూ వివాహం చేసుకున్నారు. రాఘవేందర్రావుకు అన్నపూర్ణ కు జన్మించిన కుమార్తెను రాఘవేందర్ మొదటి భార్య వద్ద ఆమెకు తెలియకుండా పెంచడం గమనార్హం.
విద్యార్థులకు కుటుంబ సంబంధాల గురించి బోధించాల్సిన ఉపాధ్యాయులు భార్యాభర్తల బంధానికి విలువ ఇవ్వకుండా ఏమాత్రం గౌరవించకుండా వివాహం చేసుకున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు ఈ విషయంలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు అని తెలుస్తోంది... మోసపూరితంగా చేసుకున్న బంధం ఇప్పుడు మచిలీపట్నం మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుకు దారితీసింది.
రాఘవేంద్రరావు తనను మోసం చేసి వివాహం చేసుకున్నాడని ఆర్థికంగానూ తనను వాడుకున్నాడని మచిలీపట్నం మహిళా పోలీస్ స్టేషన్ లో సంగీతం టీచర్ అన్నపూర్ణ ఫిర్యాదు చేసింది. అన్నపూర్ణ ఇచ్చిన ఫిర్యాదులో గుడివాడ టూ టౌన్ కు చెందిన కానిస్టేబుల్ రాఘవేంద్రరావు సోదరుడు కూడా ఉన్నాడు.
అన్నపూర్ణ ప్రేమ వ్యవహారం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో పోలీసుల విచారణ లో తేలనుంది. సంగీతం టీచర్ ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మచిలీపట్నం మహిళ పోలీస్ స్టేషన్ పోలీసులు.
Comments
Post a Comment