Skip to main content

పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతానికి డి డి ఓ లు : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ



మచిలీపట్నం:

          పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతానికి డివిజనల్ అభివృద్ధి అధికారుల కార్యాలయాలు ఎంతగానో తోడ్పడతాయని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. 

        గురువారం ఉదయం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లాలో నూతనంగా నిర్మించిన డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయంతో పాటు రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన మొత్తం 77 డిడిఓ కార్యాలయాలయ భవనాలను లాంచనంగా వర్చువల్ గా ప్రారంభించారు.
         ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ మచిలీపట్నం మండలంలోని పోతేపల్లి గ్రామ సచివాలయ పై భాగంలో నూతనంగా నిర్మించిన డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్, పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్, రాష్ట్ర ఎంజిఎన్ఆర్ఇజిఎస్ అదనపు కమిషనర్ శివప్రసాద్ లతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు డి డి ఓ, డిఎల్పిఓ, ఏపీఓ, సిబ్బంది గదులను పరిశీలించారు. తదనంతరం జిల్లా కలెక్టర్ శాసనసభ్యులు డి డి ఓ కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.

        ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలు, వారికి సంబంధించిన వివిధ రకాల పనుల కోసం జిల్లా కేంద్రానికి రాకుండా డివిజనల్ స్థాయిలో ఏర్పాటుచేసిన డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాల వద్దకు రావాలన్నారు. 

       పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్యం శాఖల వారితో తరచూ సమీక్షలు నిర్వహించి ప్రజలకు కావలసిన కనీస అవసరాలను అందించుటకు కృషి చేయాల్సి ఉంటుందన్నారు. 

        పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయడం సంతోషదాయకమన్నారు. ప్రజలకు అందుబాటులో డివిజనల్ అధికారుల కార్యాలయాలు ఏర్పాటు కావడం శుభ పరిణామం అన్నారు.

       డివిజనల్ స్థాయిలో ప్రభుత్వం చేపట్టిన వివిధ రకాల సం క్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా అమలు అయ్యేందుకు ఒకే చోట డివిజనల్ అధికారుల కార్యాలయాలు ఏర్పాటు చేయడంతో మార్గం సుగమయిందన్నారు.

          ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆక్వా కల్చర్ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ లంకె నారాయణ ప్రసాద్, డిసి ఎం ఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, జిల్లా పరిషత్ సిఇఓ కె.కన్నమనాయుడు, డ్వామా పీడీ శివప్రసాద్, డి ఎల్ డి ఓ జి పద్మ, డి ఎల్ పి ఓ రజావుల్లా, ఎంపీడీవో వెంకటేష్ ,తహసిల్దారు నాగభూషణం, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, రాష్ట్ర మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె నాని, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ, మాజీ సర్పంచ్ కాటం మధుసూదన్ 
 
        హెచ్డిఎస్ మాజీ చైర్మన్ సోమశేఖర్, స్థానిక నాయకులు శ్రీపతి చంద్రబాబు, కమ్మిలి మధుసూదన్, బండి శివ, ఎంపీడీవోలు డిప్యూటీ ఎంపీడీవోలు తదితర అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...