Skip to main content

నగరంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి కొల్లు రవీంద్ర

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:

       పింఛనుదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమయానికి పింఛన్లు అందిస్తున్నామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

సోమవారం ఉదయం మంత్రి, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ(డీసీఎంఎస్‌) ఛైర్మన్‌ బండి రామకృష్ణ తదితర నాయకులతో కలిసి నగరంలోని 16వ డివిజన్లో  లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. డయాలసిస్ పేషంట్ కి రూ. 10 వేలు, అదేవిధంగా పక్షవాతం బాధితుడు కు ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 15 వేల పింఛను అందించారు. మంత్రి లబ్ధిదారులతో ముచ్చటించి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు డివిజన్లోని ఐదు రోడ్ల సెంటర్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద అర్హులైన  ఇరువురు లబ్ధిదారులకు సొంత స్థలంలో ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వ ఆర్థిక సహాయం మంజూరు పత్రాలను అందించారు.
అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ  రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 64 లక్షల మంది లబ్ధిదారులకు ప్రతి నెలా 2,730 కోట్లతో సంవత్సరానికి దాదాపు రూ. 35 వేల కోట్లను పింఛన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తోందని తెలుపుతూ, దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇవ్వనంతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద మొత్తంలో పింఛన్లు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. 

కృష్ణాజిల్లాలో 2.30 లక్షల మంది లబ్ధిదారులకు ప్రతి నెల పింఛన్లు అందిస్తున్నామని, బందరు పట్టణంలో దాదాపు 18 వేల పింఛన్లు, బందరు మండలంలో 12వేల పింఛన్లు తెల్లవారుజామున మొదలుపెట్టి మధ్యాహ్నానికి నూరు శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేస్తున్నామన్నారు. 

దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి రూ. 15 వేలు, డయాలసిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.10 వేలు, వితంతువులు, వృద్ధులకు రూ. 4 వేలు, దివ్యాంగులకు రూ. 6 వేలు చొప్పున పేదలకు పింఛన్లు అందజేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఆదాయ వనరులను పెంచుకొని సమయానికి పింఛన్లు అందిస్తున్నట్లు తెలిపారు. 
పర్యటనలో భాగంగా మంత్రి ఐదు రోడ్ల సెంటర్లో  తేనీటిని సేవించి టీ కొట్టు యజమానితో ముచ్చటించి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో నాటి రోజులను గుర్తు చేసుకుంటూ డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ బండి రామకృష్ణ టీ షాపులో స్వయంగా కాఫీని తయారు చేసి వినియోగదారులకు అందించారు. సహాయంగా మంత్రి, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కాఫీ తయారీ ముడి పదార్థాలను డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ కు అందించారు.

కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, మాజీ జెడ్పిటిసి లంకే నారాయణ ప్రసాద్, నగర మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, సహాయ మున్సిపల్ కమిషనర్ గోపాలరావు, 16వ డివిజన్ కార్పొరేటర్ దింటకుర్తి సుధాకర్, న్యాయవాది సోడిశెట్టి బాలాజీ, లోగిశెట్టి స్వామి, బచ్చు అనీల్ తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. 

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...