శ్యామ్ కాగిత, మచిలీపట్నం:
సోమవారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భముగా కృష్ణా విశ్వ విద్యాలయంలో ఎన్ ఎస్ ఎస్ విభాగం ఆధ్వర్యములో ఎయిడ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎయిడ్స్ వల్ల శరీరంలో ఇమ్మ్యూనిటి వ్యవస్థ దెబ్బతింటుందని, కొన్ని జాగ్రత్తల తీసుకోవడం వల్ల ప్రాణాలకు వచ్చే ముప్పు ఏమి ఉండదని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఈ సందర్భముగా ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాంబాబు మాట్లాడుతూ ఎయిడ్స్ అంటువ్యాధి కాదని, తగు జాగ్రత్తలు తీసుకుంటే ఎంటువంటి ప్రాణహాని ఉండదన్నారు. ఎన్ఈపి సారధి నోడల్ అధికారిణి డా. సుశీల మాట్లాడుతూ హెచ్ఐవి పాజిటివ్ వల్ల శరీరం లో ఇమ్మ్యూనిటి వ్యవస్థ దెబ్బతింటుందని, మెరుగైన చికిత్స అందుబాటులోకి వచ్చిందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ అధికారులు డా. సల్మా, డా. రవి, డా. శేషారెడ్డి, డా. శాంతికృపా, ఫార్మసీ కళాశాల విద్యార్ధులు పాల్గొన్నారు.
Comments
Post a Comment