మచిలీపట్నం:
జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు 63 వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ వి.వి నాయుడు ముఖ్యఅతిథిగా హాజరై ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు సిహెచ్ రాజా, వి ధీరజ్ నీల్, టి.విద్యశ్రీ ఇతర పోలీసు అధికారులు పాల్గొని హోంగార్డ్స్ ఆవిర్భవ దినోత్సవ సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ముందుగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు పెరేడ్ కమాండర్ P.V సాంబశివరావు నుండి గౌరవ వందనం స్వీకరించి, పరిశీలన కోసం ఏర్పాటు చేయబడిన ప్రత్యేక వాహనంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్), అడిషనల్ ఎస్పీ (ఏ ఆర్) ప్లటూన్ వారీగా సిబ్బంది యొక్క టర్న్ అవుట్ ను పరిశీలించారు.
అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ స్వచ్ఛందంగా ప్రజాసేవ కోసం ఏర్పడిన రక్షక దళం హోమ్ గార్డ్స్ అని, కేవలం అతి తక్కువ గౌరవ వేతనంతో ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిగా విజయవాడ నగరంలో హోంగార్డ్ రక్షక దళం ఏర్పాటైందని, జిల్లావ్యాప్తంగా అంచెలంచెలుగా ఎదుగుతూ హోంగార్డులు తమ సేవలను పోలీసులతోపాటు రక్షణ, ట్రాఫిక్, పోలీస్ స్టేషన్ విధులు, డ్యూటీ డ్రైవర్లుగా, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు రక్షణగా విధులు నిర్వహిస్తున్నారన్నారు.
ఎవరైనా హోమ్ గార్డ్ పదవీ విరమణ చెందినా లేదా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినా వారి కుటుంబ సభ్యులకు ఒక రోజు గౌరవ వేతనాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.
అనంతరం హోంగార్డ్ సిబ్బంది ప్లటూన్ల వారీగా అద్భుతమైన కవాతును ప్రదర్శిస్తూ హోంగార్డ్ సిబ్బంది ముఖ్య అతిథులకు గౌరవ వందనం సమర్పించారు.
అనంతరం అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు ఇతర పోలీసు అధికారులతో కలిసి హోం గార్డ్ ర్యాలీ ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో హోంగార్డు లు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ర్యాలీ జిల్లా పోలీసు కార్యాలయం నుండి లక్ష్మి టాకీస్ సెంటర్ వరకు అనంతరం పోలీసు కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగించారు. ర్యాలీలో పోలీస్ అధికారులు అందరూ పాల్గొన్నారు.
Comments
Post a Comment