మచిలీపట్నం:
జిల్లాలో డిపిఓ డాక్టర్ జె అరుణ ఆధ్వర్యంలో ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించినందుకు 5 గ్రామపంచాయతీలకు ఐఎస్ఓ 90001 ధ్రువీకరణ పత్రాలు రాగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా సంబంధిత గ్రామపంచాయతీల ఈవోలు అందుకున్నారు.
వాటిలో ఆత్కూరు గ్రామం ఈ--పంచాయతీ సుపరిపాలన అందించడంలో, కేసరపల్లి గ్రామం కాఫీ షాప్ ద్వారా సొంతంగా రెవెన్యూ సాధించుటలో, బాపులపాడు స్వచ్ఛ రథం నిర్వహణలో, పునాదిపాడు గ్రామం చెత్త నుండి సంపద తయారీలో, నాగాయలంక గ్రామం ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాల యాజమాన్య యూనిట్ నిర్వహణలో ఆదర్శంగా నిలవడంతో ఈ ఐఎస్ఓ ధ్రువీకరణ పత్రాలు పొందగలిగాయి.. గ్రామపంచాయతీలు ఐఎస్ఓ ధ్రువీకరణ పత్రాలు పొందడంలో నాయకత్వం వహించి విశేషంగా కృషి చేసిన డిపిఓ డాక్టర్ జె అరుణను, పంచాయతీల ఈవోలను కలెక్టర్ అభినందించి ఇంకా బాగా పనిచేయాలని వారిని ప్రోత్సహించారు.
Comments
Post a Comment