మచిలీపట్నం:
శ్రీయుత గౌరవనీయులైన కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టర్ గారు జిల్లాలో ఖరీఫ్ 2025-26 సీజనుకు గాను ధాన్యము సేకరణ చేయుటకు 287 రైతు సేవ కేంద్రములు ఏర్పాటు చేయటం జరిగినది.
కృష్ణా జిల్లాలో గత సంవత్సరం ఈ రోజుకి 1,82,405 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేయగా ఈ సంవత్సరం 2,46,473 మెట్రిక్ టన్నుల ధాన్యమును 29,668 మంది రైతుల వద్ద నుండి సేకరణ చేసి 502.50 కోట్ల రూపాయలు రైతుల 48 గంటలలో రైతుల ఆధార్ కు అనుసంధానం అయిన రైతు బ్యాంక్ ఖాతాలో నేరుగా జమచేయటం జరిగినది.
రైతుల వద్ద నుండి ధాన్యము సేకరణ చేయుటకు నేటి వరకు 72,98,622 గోనె సంచులు జిల్లాలోని రైతు సేవ కేంద్రముల వద్ద రైతులకు అందుబాటులో ఉంచటం జరిగినది.
జిల్లాలోని ధాన్యమును మిల్లులకు తరలించుటకు 4,199 వాహనములను అందుబాటులో ఉంచటం జరిగినది. రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేయుటకు జిల్లా, డివిజన్, మండల మరియు గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి వారితో నిరంతరం సమీక్షలు నిర్వహించడంతో పాటుగా క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు పర్యటించి ధాన్యం సేకరణ లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకొనుటకు సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు మరియు సూచనలు ఇవ్వడమైనది.
ఈ ఖరీఫ్ సీజనులో కనీస మద్దతు ధర (MSP) ప్రతి క్వింటాల్ ధాన్యముకు సాధారణ రకం రూ.2,369/- చొప్పున మరియు గ్రేడ్- ఏ రకానికి రూ.2,389/- చొప్పున ప్రతి రైతునకు పూర్తి పారదర్శకంగా నేరుగా వారి బ్యాంకు అక్కౌంట్ కు ఆధార్ నెంబరు ఆధారముతో జమ చేయడం జరుగును అని తెలియజేయడమైనది.
వాతావరణము అనుకూలముగా ఉన్నందున జిల్లాలోని రైతులందరూ పరిపక్వం లేని ధాన్యమును ఎట్టి పరిస్థితులలో కోతలు కోయరాదని మరియు పరిపక్వము చెందిన ధాన్యమును పూర్తిగా ప్రభుత్వము వారు నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఆరబెట్టుకుని శుద్ధి చేసుకుని రైతు సేవా కేంద్రము ద్వారా విక్రయించి కేంద్ర ప్రభుత్వము వారు నిర్దేశించిన కనీస మద్దతు ధర పొందవలసిందిగా కోరడమైనది.
మద్దతు ధర పొందుటకు పాటించవలసిన నాణ్యతా ప్రమాణాలు నాణ్యతా ప్రమాణాలు 3. ఎ) స్యర్థి సనార్థాలు మట్టి పెల్లలు మొంక Verse vege ganaga కృష్ణా జిల్లాలోని రైతులకు ధాన్యము విక్రయించుటలో ఎటువంటి సలహాలు మరియు ఫిర్యాదుల కొరకు సంబంధిత రైతు సేవ కేంద్రము సిబ్బందిని, మండల మరియు డివిజన్ స్థాయి అధికారులను సంప్రదించవలెను.
వారి వద్ద సమస్య పరిష్కారం కాని యెడల జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ 8247693551 ను సంప్రదించవలెను
Comments
Post a Comment