Skip to main content

రైతులకు ప్రభుత్వం 24 గంటల్లో ధాన్యం పైకం చెల్లిస్తుంది : మంత్రి కొలుసు పార్థసారథి

 
మచిలీపట్నం:

        రైతులకు అన్యాయం జరగకుండా ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వమే కొనుగోలు చేసి ఎక్కడ లేని విధంగా 24 గంటల్లో పైకం చెల్లిస్తుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. 

        ఆదివారం మంత్రి రాష్ట్ర గౌడ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి జన్మదిన వేడుకలలో భాగంగా తొట్ల వల్లూరులో ప్రభుత్వ వైద్యులు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. 

       ఈ సందర్భంగా మంత్రివర్యులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తాను రైతు బిడ్డ అని, రైతుల కష్టాలు తెలుసని, రైతులకు మేలు చేయాలని ఉద్దేశంతోనే తాను శనివారం కఠినంగా వ్యవహరించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం డబ్బులు రైతులకు చెల్లించే ఏర్పాటు చేశామన్నారు. 

        గత ప్రభుత్వం లాగా రైతులకు డబ్బులు ఎగ్గొట్టే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. అణా పైసలతో సహా నిబంధనల ప్రకారం ప్రతి రైతు పండించిన పంటకు ధర చెల్లించడమే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. 
      దేశంలో ఎక్కడా లేనివిధంగా 24 గంటల్లోనే ధాన్యం డబ్బులు రైతులకు చెల్లిస్తున్న ప్రభుత్వం తమదేనన్నారు. దాదాపు 20 వేల కోట్ల రూపాయల విధులను ధాన్యం డబ్బులు చెల్లింపు కోసం ముందుగానే సిద్ధం చేసుకున్నామన్నారు. కొన్న ప్రతి బస్తాకు 24 గంటల్లో అవసరమైతే 4 నుంచి 5 గంటల్లో కూడా చెల్లింపు చేసిన దాఖలాలు ఉన్నాయన్నారు. ధాన్యం డబ్బులు రైతుకు చెల్లించాలనే చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

        తాను పేదరికం నుంచి వచ్చానని తనకు రైతుల బాధలు తెలుసన్నారు. రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం జరగకూడదన్నది ప్రధాన ఉద్దేశం అని ప్రతి రైతుకు మేలు జరగాలన్నదే తమ అభిమతం అన్నారు. రైతులకు మిల్లర్లు గాని, బ్రోకర్లు గాని ఎవరు అన్యాయం చేసిన కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. ప్రభుత్వ అధికారులు పనితీరు, ప్రవర్తన పట్ల ప్రజల అభిప్రాయాలను పైనుండి ఎప్పటికప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి సేకరిస్తున్నారన్నారు.

       దీంతో మిల్లర్లు గాని, అధికారులు గానీ ఎవరు కూడా రైతుకు అన్యాయం చేయాలంటే వెనుకంజ వేస్తారన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...