మచిలీపట్నం:
అహ్మదాబాద్ గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో IAMAI మరియు NABARD సంయుక్తంగా నిర్వహించిన జాతీయ స్థాయి ఎర్త్ సమ్మిట్ – 2025 “Empowering Agriculture Rural Tech & Humanity” కార్యక్రమంలో మాజీమంత్రి కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఇతర డిసిసిబి చైర్మన్ల తో కలిసి పాల్గొన్నారు
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర సహకార మరియు హోం శాఖ మంత్రివర్యులు అమిత్ షా రూరల్ కోఆపరేటివ్ రంగ అభివృద్ధిపై ప్రసంగించారు.
సమ్మిట్ సందర్భంగా NCUI & IFFCO చైర్మన్ దిలీప్ సంఘాని మరియు NABARD చైర్మన్ షాజీ కెవి తో కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కోఆపరేటివ్ బ్యాంకింగ్ భవిష్యత్తు, రైతు సాధికారత, నూతన రూరల్ టెక్ విధానాలపై కీలక చర్చలు జరిగాయి.
ఈ కార్యక్రమంలో గుంటూరు DCCB చైర్మన్ ఎం. మల్లిఖార్జున రావు, నెల్లూరు DCCB చైర్మన్ ఎం. ధనంజయరెడ్డి, అనంతపురం DCCB చైర్మన్ ఎం. కేశవరెడ్డి, విశాఖపట్నం DCCB చైర్మన్ కె. తాతారావు, కడప DCCB చైర్మన్ ఎం. సూర్యనారాయణ రెడ్డి, APCOB సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment