Skip to main content

మీకోసం అర్జీలు 149, ఉద్యోగుల అర్జీలు.10


మచిలీపట్నం:

     సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, డిఆర్ ఓ కే చంద్రశేఖర రావు, కె ఆర్ ఆర్ సి ఎస్ డి సి శ్రీదేవి, మెప్మా పిడి సాయిబాబు, డిఎస్పి శ్రీనివాసరావులతో కలిసి మీకోసం ----ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. అంతకుమునుపు ఉద్యోగుల గ్రీవెన్స్ దినం నిర్వహించి ఉద్యోగుల నుండి అర్జీలు స్వీకరించారు. 

   కలెక్టరేట్లో మొత్తం 149 మీకోసం అర్జీలు రాగా 10 ఉద్యోగుల అర్జీలు జిల్లా యంత్రాంగం స్వీకరించింది. 
అందులో కొన్నింటి వివరాలు ఇలా ఉన్నాయి: 

      మచిలీపట్నం ఒకటో డివిజన్ కు చెందిన దివ్యాంగురాలు సజ్జ వీణా దేవి తన తల్లి ఉషారాణితో కలిసి చక్రాల కుర్చీలో కలెక్టరేట్ కు రాగా జిల్లా కలెక్టర్ ఆమె వద్దకు వచ్చి ఆమె సమస్య ఏంటో ఎంతో ఓపికగా ఆలకించారు.ఈ సందర్భంగా ఆమె తల్లి మాట్లాడుతూ తన కుమార్తెకు 40 సంవత్సరాల వయస్సని, ఇదివరకు దివ్యాంగుల పించను వస్తుండేదని కరెంటు బిల్లు అధికంగా వస్తుందని పింఛన్ ను తొలగించారని తన కూతురు బుద్ధిమాంద్యం కలదని పింఛను పునరుద్ధరించాలని కోరుతూ కలెక్టర్కు అర్జీ అందజేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ వెంటనే సానుకూలంగా స్పందిస్తూ తగిన న్యాయం చేయాలని డి ఆర్ డి ఎ పి డి హరిహరనాథ్ కు సూచించారు. 

      మొవ్వ మండలం బార్లపూడి గ్రామానికి చెందిన గోవాడ రవిబాబు తనకు ఎడమకాలు లేదని, 91% వికలత్వ ధ్రువీకరణ పత్రం ఉందని దివ్యాంగుల పింఛను మంజూరు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు అర్జీ అందజేశారు. దీనిపై కూడా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని డి ఆర్ డి ఎ పి డి కి సూచించారు. 

      పెడన మండలం చెన్నూరు గ్రామానికి చెందిన గుడి సేవ లక్ష్మీ రాణి మాట్లాడుతూ తమతోపాటు మరి కొంతమంది రైతులు వరి, మినుము పంటలు వేసుకున్నామని తమకు సమీపంలో కొందరు చేపలు, రొయ్యల చెరువులు త్రవ్వుకుని వాటి వ్యర్ధాల నీటిని పంట బోదేలుకు వదులుతున్నారని ఫిర్యాదు చేస్తూ దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

      మచిలీపట్నానికి చెందిన వన్నం రెడ్డి శ్రీనివాస్ గ్రీన్ ఫీల్డ్ ఓడరేవుకు వెళ్లే రహదారి మార్గంలో తనకు సంబంధించిన భూములను జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని వెబ్ ల్యాండ్ కు సంబంధం లేకుండా డ్రాఫ్ట్ డిక్లరేషన్ చేసినందుకు జిల్లా కలెక్టర్ ను ఘనంగా సన్మానించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ 11 ప్రభుత్వ శాఖల నుండి ఉత్తమ విధానాలకు సంబంధించిన నివేదికలు మిగిలిన శాఖలు కూడా వెంటనే సీపీఓ కు అందజేయాలన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల లబ్ధిదారుల విజయగాథలను డిఆర్డిఏ పిడికి అందజేయాలన్నారు
     ఈ సందర్భంగా డిటిడబ్ల్యుఓ ముస్తాబు కార్యక్రమం పై రూపొందించిన గోడపత్రాన్ని, దివ్యాంగుల హక్కుల చట్టం 2016 ఏపీ ప్రభుత్వ నియమాలు 2023 తెలుగు ఆంగ్ల భాషలో రూపొందించిన పుస్తకాన్ని జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.
         ఈ కార్యక్రమంలో జడ్పీ డిప్యూటీ సీఈవో ఆనంద్ కుమార్, ఆర్ అండ్ బి ఈఈ లోకేష్, డి ఆర్ డి ఏ పి డి హరిహరనాథ్, డిఎస్ఓ మోహన్ బాబు, డిపిఓ డాక్టర్ జె అరుణ పశుసంవర్ధక శాఖ జీడి అయ్యా నాగరాజు, డిటిడబ్ల్యుఓ ధూర్జటి పహాని మున్సిపల్ కమిషనర్ ,బాపిరాజు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...