Skip to main content

డిసెంబర్ 14 జాతీయ ఇంధన సంరక్షణ దినోత్సవం



       ఎనర్జీ ఎఫిషియెన్సీ బ్యూరో (Bureau of Energy Efficiency – BEE) భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 14 జాతీయ ఇంధన సంరక్షణ దినోత్సవం (National Energy Conservation Day) నిర్వహిస్తుంది. 

        ఇంధనాన్ని సమర్థవంతంగా వినియోగించడం పై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇంధన వనరులు పరిమితమైనవి. విద్యుత్ ఉత్పత్తి వల్ల కాలుష్యం పెరుగుతుంది. ఇంధన ఆదాతో ఖర్చులు తగ్గుతాయి. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా భవిష్యత్ తరాలకు వనరులు కాపాడబడతాయి.

       పునరుత్పాదక ఇంధనం (Renewable Energy) అంటే మళ్లీ మళ్లీ సహజంగా లభించే ఇంధన వనరుల నుండి పొందే శక్తి. పునరుత్పాదక ఇంధనం లో సౌర శక్తి (Solar Energy) (సూర్య కిరణాల), వాయు శక్తి (Wind Energy) (గాలిచలనం), జల విద్యుత్ (Hydro Power) (నీటి ప్రవాహం), జీవ ఇంధనం (Biomass Energy) (వ్యవసాయ వ్యర్థాలు, చెత్త), భూగర్భ ఉష్ణశక్తి (Geothermal Energy) (భూమి లోపలి ఉష్ణం) వంటి రకాలున్నాయి.

       పునరుత్పాదక ఇంధనం వల్ల కాలుష్యం తగ్గుతుంది, ఇంధన కొరత ఉండదు, పర్యావరణం పరిరక్షించబడుతుంది. దాని వల్ల భవిష్యత్తు తరాలకు ఉపయోగకరం.
        పునరుత్పాదక ఇంధనంలో సౌర ఇంధనం వినియోగానికి ప్రభుత్వం ప్రోత్సహం అందిస్తుంది. బొగ్గు, నీరు, గాలి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రాల వద్ద ప్రభుత్వాలు విద్యుత్ ను కొనుగోలు చేసి విధ్యుత్ తీగల ద్వారా గృహ, వాణిజ్య అవసరాలకు వినియోగదారులకు సరఫరా చేసున్నాయి. దాంతో నాణ్యమైన విద్యుత్ ఉత్పత్తి, సరఫరా ప్రభుత్వానికి వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. కానీ వినియోగదారులే స్వయంగా వారి అవసరాలకు తగినంత విద్యుత్ ను ఉత్పత్తి చేసుకోవడం... మిగులు విద్యుత్ ను విద్యుత్ కేంద్రాలకు సరఫరా చేయడం.... తద్వారా విద్యుత్ కేంద్రాల నుంచి ఆదాయం పొందటం పీఎం సూర్య ఘర్ ముఫ్తి బిజిలి యోజన ద్వారా సాధ్యపడుతుంది. విద్యుత్ కేంద్రాలకు సరఫరా చేసే ప్రతి యూనిట్ విద్యుత్ కు విద్యుత్ కేంద్రాలు డబ్బులు చెల్లిస్తాయి.  

       సౌర విద్యుత్ పై కేంద్ర ప్రభుత్వ రాయితీ మరియు బ్యాంకు ఋణ సౌకర్యం   
  
        భగభగ మండే సూర్యుని కిరణాలను సౌర ఫలకాల ద్వారా ఆహ్వానించి బ్యాటరీ లో బంధించి విద్యుత్ రూపంలో మన ఇంటి అవసరాలకు వాడుకొని ... మిగులు విధ్యుత్ ను విద్యుత్ సంస్థలకు యూనిట్ రూ 2.09 కు విక్రయించుకోవచ్చు. సౌర విధ్యుత్ కేంద్రం ఏర్పాటు చేసుకునే వారికి దేశం మొత్తం మీద రూ.75,021 కోట్లు సబ్సిడీ ఇవ్వాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది.

        2023-24 నుంచి 2026-27 వరకు పీఎం సూర్య ఘర్ ముఫ్తి బిజిలి యోజన పథకం కింద ఈ సబ్సిడీ మొత్తం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ పథకం కింద 1-2 కిలోవాట్ సామర్ధ్యానికి 60% సబ్సిడీ, 3కిలోవాట్ సామర్ధ్యానికి 40% సబ్సిడీ ప్రభుత్వం అందచేస్తుంది. గరిష్టంగా రూ. 78,000 సబ్సిడీ లభిస్తుంది. 

       అవసరమైన వారికి బ్యాంకు ద్వారా ఋణ సౌకర్యం కూడా ప్రభుత్వం కల్పించడం ఈ పధకంలో ప్రత్యేకత. ఉదాహరణకు సుమారుగా సౌర విధ్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు రూ 1.5 లక్షలు ఖర్చు అయితే గరిష్టంగా రూ. 78,000 సబ్సిడీ ప్రభుత్వం భరిస్తుంది. మిగతా మొత్తాన్ని అవసరమైన వారికి బ్యాంకు నుండి పూచీకత్తులేని ఋణంగా అందచేస్తుంది.  
    
శ్యామ్ కాగిత,
మచిలీపట్నం 

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...