జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక ని అవమానించేలా మాట్లాడిన జడ్పీ సీఈఓ పై ఆగ్రహం
సీఈవో ను సస్పెండ్ చేయాలి అంటూ కృష్ణాజిల్లా జడ్పిటిసిలు, ఎంపీపీలు పోడియం వద్ద నిరసన
శనివారం ఉమ్మడి కృష్ణాజిల్లా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో చైర్ పర్సన్ ఉప్పల హారిక అధ్యక్షతన జరిగింది. జడ్పీ పాలకవర్గం ఆమోదం లేకుండా 24 కోట్ల రూపాయల విలువైన సుమారు 424 పనులను జడ్పీ సీఈవో కన్నమ నాయుడు రద్దుపరిచారని తీవ్రమైన పదజాలంతో సీఈఓ కన్నమ్మ నాయుడును జడ్పీటీసీలు విమర్శించారు. సీఈఓ ఒంటెద్దు పోకడలను చైర్ పర్సన్ ఉప్పల హారిక ఖండించారు. జనవరి 26 రాజ్యాంగ దినోత్సవం రోజున జడ్పీ చైర్పర్సన్ పదవి అంటే ఒక కాపల కుక్కని సీఈఓ అన్నారని చైర్ పర్సన్ జడ్పిటిసి సభ్యులు ఆరోపించారు.
చైర్ పర్సన్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జడ్పిటిసి సభ్యులు, ఎంపీపీలు పోడియం దగ్గర బైఠాయించారు. దాదాపు నాలుగు గంటలు సభ నిర్వహించకుండా అడ్డుకున్నారు. జడ్పీ సీఈవో కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పరుష పదజాలం వాడిన సీఈఓ కే కన్నామ నాయుడు ని సస్పెండ్ చేయాలని జడ్పీటీసీలు, ఎంపీపీలు డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో సంబంధిత ఉత్తర్వులను తక్షణం ఉపసంహరించుకోవాలని వైస్ చైర్మన్లు గుడిమళ్ళ కృష్ణంరాజు, గరికిపాటి శ్రీదేవి ఇతర ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ సభా వేదిక వద్ద బైఠాయించారు. ఈ అంశంపై సుదీర్ఘ వాదనల అనంతరం, సభ్యుల కోరిక మేరకు జడ్పీ సీఈవో సవరణ ఉత్తర్వులను జారీ చేశారు.
జెడ్పీటీసీ సభ్యులు చేపట్టిన పనులను వారితో చర్చించకుండా తాత్కాలికంగా నిలిపివేస్తూ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం ఎంత మాత్రం సరైనది కాదని శాసనమండలి సభ్యుడు మొండితోక అరుణకుమార్ అధికారులకు సూచించారు.
జిల్లా పరిషత్ సభ్యులు ప్రతిపాదించిన వర్కులు కనీసం జడ్పీటీసీ సభ్యులకు చైర్పర్సన్ కి తెలియపరచకుండా రద్దు పరిచే విధంగా నిర్ణయాన్ని తీసుకున్న జడ్పీ సీఈఓ పై చర్యలు తీసుకోవాలని జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక కలెక్టర్ ని కోరారు.
సీఈవో తప్పులను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సమర్ధిస్తున్నారని ఉప్పల హారిక ఆవేదన వ్యక్తం చేశారు. జడ్పిటిసి, ఎంపీపీ లకు జరిగిన అవమానాన్ని సభ్యులందరూ తీర్మానించి కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని ఆమె అన్నారు.
సమావేశంలో కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలాక్కియ, నూజివీడు సబ్ కలెక్టర్ బి వినూత్న పాల్గొన్నారు.
Comments
Post a Comment