చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు
కొంచమైన నదియు కొదవ కాదు
విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత
విశ్వదాభిరామ వినుర వేమ
మనసుపెట్టి చేస్తే ఏ చిన్న పనైనా సత్ఫలితాలను ఇస్తుంది. మనసు దాని మీద లేకపోతే అది ఫలించదు. మర్రి చెట్టు విత్తనము ఎంతో చిన్నది అయినా ఎంతో పెద్ద చెట్టయి విస్తరిస్తుంది. కాబట్టి ఏ పనైనా మనసారా చేయమని భావము.
Comments
Post a Comment