కృష్ణా విశ్వవిద్యాలయం: డిసెంబర్ 4,5,6 తేదీలలో నిర్వహించే కృష్ణాతరంగ్ 2025 పోస్టర్ ను కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె రాంజీ ఆవిష్కరించారు. శనివారం ఉపకులపతి ఛాంబర్ లో జరిగిన కార్యక్రమంలో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలలు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు పోటీల వివరాలు తెలియచేసే షెడ్యూల్ తో పోస్టర్ రూపొందించారు.
ఈ కార్యక్రమంలో కృష్ణాతరంగ్ 2025 కన్వీనర్ ఆచార్య దిలీప్, కోశాధికారి డా. నవీన లావణ్య లత, కో కన్వీనర్ డా. సుశీల, ఆహ్వాన కమిటీ సభ్యులు డా. సుజాత, డా. అనిల్, పిఆర్ఓ మత్తే నాగరాజ్ లు పాల్గొన్నారు.
శ్యామ్ కాగిత
9247033394
Comments
Post a Comment