Skip to main content

మచిలీపట్నం, విశాఖలో మైరా బే వ్యూ రిసార్ట్స్


మచిలీపట్నం, విశాఖలో తీర ప్రాంత అభివృద్ధికి మైరా బే వ్యూ రిసార్ట్స్ తో ఒప్పందం కుదిరినట్లు
పర్యాటక శాఖ వెల్లడించింది.

ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా ప్రభుత్వానికి ప్రత్యక్ష, పరోక్ష పన్ను ఆదాయం, ప్రాంతీయ ఆర్థిక ప్రయోజనాలతో పాటు తీర ప్రాంత అభివృద్ధికి బీజం పడనుందని తద్వారా 880 మందికి ప్రత్యక్ష, 1100 మందికి పరోక్ష ఉపాధి కలగనుందని పర్యాటక శాఖ వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన నూతన పర్యాటక, భూ కేటాయింపుల పాలసీకి అనుగుణంగా రాష్ట్రంలోని మచిలీపట్నం, విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు మైరా బే వ్యూ రిసార్ట్స్ ముందుకు వచ్చింది. 
రూ.255.91 కోట్ల అంచనా వ్యయంతో విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం కొత్తవలసలో 'మైరా బే వ్యూ రిసార్ట్స్ మరియు 3000 మంది సామర్థ్యం గల కన్వెన్షన్ సెంటర్ ను 15 ఎకరాల్లో నెలకొల్పేందుకు నిర్ణయించింది. ఇది పూర్తయితే భీమిలి నుండి భోగాపురం వరకు ఉన్న పర్యాటక కారిడార్ లో ఒక సమగ్ర హై ఎండ్ పర్యాటక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు గా నిలవనుంది. అంతేగాక లగ్జరీ విల్లా తరహా కాటేజీలు, టవర్ హోటల్ బ్లాక్ తో సహా 196 గదులను నిర్మించనుంది. అదే విధంగా ప్రీ -ఫంక్షన్ ప్రదేశాలు, బిజినెస్ మీటింగ్ రూమ్ లు, ఎగ్జిబిషన్ జోన్ లను ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయనుంది. 600 మంది సామర్థ్యం గల బ్యాంకెట్ హాల్, 200 మంది సామర్థ్యం గల రెండు బహుళార్ధసాధక బాల్‌రూమ్‌లతో పాటు రూఫ్‌టాప్ ఇన్ఫినిటీ పూల్, స్పాలు, వెల్ నెస్ థెరఫీ జోన్ లు, ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ (400+ మందికి), 20,000 చ.అ.ల రిటైల్/షాపింగ్ ప్రాంతం ఏర్పాటు చేయనుంది. తద్వారా 500 మందికి ప్రత్యక్షంగా మరో 500 మందికి పరోక్షంగా ఉపాధి కలగనుంది.ఈ ప్రాజెక్ట్ ద్వారా 99 సంవత్సరాలకు రాష్ట్ర ప్రభుత్వానికి లీజు ద్వారా వచ్చే ఆదాయం అంచనా రూ. 130.78 కోట్లు. 99 సంవత్సరాలకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయ వాటా (revenue share) అంచనా రూ. 216.63 కోట్లు. ప్రస్తుతం ఉన్న భూమి విలువ ఎకరానికి రూ.3 .63 కోట్ల చొప్పున 15 ఎకరాలకు రూ.54.45 కోట్లు విలువ చేస్తుంది. 

దీనితో పాటు రూ.157.53 కోట్ల అంచనా వ్యయంతో కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం తాళ్లపాలెం గ్రామంలో'లార్జ్ అమ్యూజ్‌మెంట్ పార్క్ కమ్ రిసార్ట్' ను నిర్మించేందుకు 20 ఎకరాలు కేటాయించబడింది. తీర ప్రాంతంలో ఆతిథ్య, వినోద కేంద్రానికి కేరాఫ్ అడ్రస్ గా నిలవనున్న ఈ ప్రాజెక్టులో 30,000 చదరపు అడుగులలో అమ్యూజ్‌మెంట్ పార్క్, 25,000 చ.అ.లలో వాటర్ పార్క్ & రైడ్‌లు, 150 గదులు, ఐదు రెస్టారెంట్లు మరియు బార్, 16,000 చ.అ.ల కన్వెన్షన్ సెంటర్, వెల్‌నెస్ స్పాలు, స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటు కానున్నాయి. తద్వారా 380 మందికి ప్రత్యక్షంగా, 600 మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది.

ఈ ప్రాజెక్ట్ ద్వారా 99 సంవత్సరాలకు రాష్ట్ర ప్రభుత్వానికి లీజు ద్వారా వచ్చే ఆదాయం అంచనా రూ. 12.81 కోట్లు. 99 సంవత్సరాలకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయ వాటా (revenue share) అంచనా రూ. 119.17 కోట్లు గా పర్యాటక శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువ ప్రకారం ఎకరా 26.67 లక్షలు కాగా 20 ఎకరాలకు దాదాపు రూ. 5.33 కోట్లు అవుతుంది. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా ప్రభుత్వానికి ప్రత్యక్ష, పరోక్ష పన్ను ఆదాయం, ప్రాంతీయ ఆర్థిక ప్రయోజనాలతో పాటు తీర ప్రాంత అభివృద్ధికి బీజం పడనుందని పర్యాటక శాఖ పేర్కొంది.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...