డ్రగ్స్ వద్దు బ్రో – సైకిల్ తొక్కు బ్రో” FOR A DRUG FREE SOCIETY అనే నినాదంతో మారుమోగిన గుడివాడ పట్టణ వీధులు
ఆదివారం ఉదయం 6 గంటలకు కృష్ణ జిల్లా గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం కమిటీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, Cycle క్లబ్ ఆధ్వర్యంలో GUDIWADA CYCLOTHON 2025 - “డ్రగ్స్ వద్దు బ్రో – సైకిల్ తొక్కు బ్రో” అన నినాదం తో గుడివాడ NTR స్టేడియం నుండి సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా గౌరవ ఆంధ్రప్రదేశ్ “ఈగల్” (Elite Anti-Narcotics Group for Law Enforcement) విభాగాధిపతి ఇన్స్పెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ ఆర్కే.రవికృష్ణ, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, కృష్ణాజిల్లా ఎస్పి వి విద్యాసాగర్ నాయుడు, ఈగల్ టీం ఎస్పి మహేశ్వర రాజు పాల్గొన్నారు. ముందుగా డ్రగ్ ఫ్రీ సొసైటీ సే నో టూ డ్రగ్స్ ప్రచార ప్లే కార్డులను ఏపి ఈగల్ ఐజి రవి కృష్ణ, ఎమ్మెల్యే రాము దంపతులు పావురాలు వదిలి ర్యాలీను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమమును NTR స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు జెండా ఊపి సైకిల్ ర్యాలీ ప్రారంభించారు. సైకిల్ ర్యాలీ NTR స్టేడియం నుండి మొదలై మిని వాన్స్ స్టాండ్ రోడ్- నాగవరప్పాడు బ్రిడ్జి టెర్మినల్ పాయింట్-అయ్యప్ప స్వామి టెంపుల్-ముగ్గు బజార్-స్టాండ్ రోడ్-NTR స్టేడియం నకు 10 కిలోమీటర్లు విజయవంతంగా సాగింది.
ఈగల్ ఐజీపీ ఆకే.రవికృష్ణ మాట్లాడుతూ అమాయకులు మాదకద్రవ్యాల వలలో చిక్కుకుని జీవితాలను నాశనం చేసుకునే పరిస్థితులు బాధాకరమని అన్నారు. మంచి అలవాట్లు, చెడు అలవాట్ల మధ్య తేడాను చిన్నప్పటి నుంచే గుర్తించాల్సి ఉందని తెలిపారు.
ఏపి లోని అన్ని విద్యాసంస్థల్లో డ్రగ్స్ వద్దు బ్రో అవగాహన కార్యక్రమములు నిర్వహిస్తున్నామని తెలిపారు. గంజాయి కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న కొందరు విద్యార్ధుల గురించి తెలియజేస్తూ విశాఖపట్నం సెంట్రల్ జైలు ని సందర్శించినపుడు బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివిన కుర్రవాడికి ఉన్న నలుగురు స్నేహితులలో ఒకతనికి గంజాయి అలవాటు ఉండడం వలన సదరు వ్యక్తి 62 కేజీల గంజాయిని కారులో మిగతా వారికి తెలియకుండా రవాణా చేస్తూ పోలీసులకి పట్టుబడడంతో మిగతా నలుగురు ఫ్రెండ్స్ కూడా జైలులో శిక్ష అనుభవిస్తున్నారని తెలిపారు.
గేట్‌వే డ్రగ్స్ సిద్ధాంతంపై అవగాహన - యువత భవిష్యత్తు కోసం ఒక హెచ్చరిక.ఈ సిద్ధాంతం ప్రకారం ధూమపానం, మద్యం, గుట్కా లేదా ఈ-సిగరెట్లు వంటి పదార్థాలను వాడటం మొదట్లో చిన్న అలవాట్లుగా కనిపిస్తాయి, కాని ఇవి తర్వాత గంజాయి, కొకైన్, హెరాయిన్ వంటి అత్యంత హానికరమైన మాదకద్రవ్యాల వినియోగానికి “గేట్వే”లుగా (దారులుగా) మారతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గంజాయి,డ్రగ్స్ నివారణ కొరకు ఈగల్ చేపడుతున్న అవగాహన కార్యక్రమాలలో భాగంగా ఏపి లోని 60,000 విద్యాసంస్థల్లో ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈగల్ క్లబ్స్ లో నలుగురు విద్యార్ధులు, నలుగురు విద్యార్దినిలు, ఇద్దరు ఉపాద్యాయులు ఉంటారు. వారు తమ విద్యాసంస్థల్లో గంజాయి, డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తారు. ఈగల్ క్లబ్స్ ద్వారా కార్యక్రమములు నిర్వహిస్తూ NDPS చట్టం 1985 పై అవగాహన కల్పిస్తారు.
ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్:-
విద్యాసంస్థల సరిహద్దుల్లో పొగాకు ఉత్పత్తుల అమ్మకాలు జరగకుండా చర్యలు చేపడుతున్నాము.
ఆపరేషన్ చైతన్యం :-
ఆపరేషన్ చైతన్యం ద్వారా ఏపి లో గంజాయి సాగు పూర్తిగా అరికట్టడం జరిగింది. గంజాయి సాగు చేసే రైతులకు ప్రత్యామ్నాయ పంటలను అందజేయడ జరుగుతుంది. ఆపరేషన్ చైతన్యం ద్వారా మౌళికంగా రైతులలో మార్పు తీసుకువచ్చి గంజాయి సాగు లేకుండా ఏఎస్ఆర్ జిల్లాలోని ప్రతి రైతు కూడా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
ఆపరేషన్ ట్రైన్స్:-
ఇతర రాష్ట్రాల నుండి ఏపి మీదగా వెళ్ళు 22 రైళ్ళను ఈగల్ సెల్స్, RPF, GRP, డాగ్ స్క్వాడ్ అనుసంధానం చేసి రైడ్స్ నిర్వహించి గంజాయి ని అరికట్టడం జరుగుతుందని తెలిపారు.
ఆపరేషన్ చైతన్యం: -
ఏపి లో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించడం జరిగిందని తెలిపారు. డ్రోన్ సర్వేలెన్స్, శాటిలైట్ అడ్మిషన్, కార్డన్ అండ్ సెర్చ్, అవగాహన కార్యక్రమాల ద్వారా ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. కొత్తగా ప్రవేశపెట్టిన ఈగల్ కెనైన్ డాగ్ స్క్వాడ్ ద్వారా ముఖ్య ఆపరేషన్లు చేపడుతున్నట్లు వివరించారు.
ఆపరేషన్ గరుడ:-
రాష్ట్రంలోని మెడికల్ షాపులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, చట్టవిరుద్ధ ఔషధాల పైన కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఆపరేషన్ సేఫ్ కాంపస్ జోన్:-
విద్యాసంస్థలకు 100 మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తుల అమ్మకాన్ని నిషేధించామని చెప్పారు.
ఏపి లోని ప్రతి ఒక్కరు బాద్యత వహించి మీ పరిసరాల్లో, చుట్టూ ప్రక్కల గంజాయి, డ్రగ్స్, మత్తుపదార్ధాలు కు సంభందించి ఎటువంటి సమాచారం ఉన్నా ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కి లేదా ఈగల్ వాట్స్ యాప్ నెంబర్ 8977781972 నకు లేదా ఈగల్ సామాజిక మాద్యమాలైన ఇన్స్టాగ్రామ్, పేస్ బుక్, యు ట్యూబ్, ఎక్స్ వేదికలైన @eagleap1972 నకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
ఈ కార్యక్రమము లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ మాగంటి శ్రీనివాస్, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ సంయుక్త కార్యదర్శి కిలారపు రంగ ప్రసాద్, బూరగడ్డ శ్రీకాంత్, ధావులూరి సురేంద్రబాబు, ఈగల్ టీం ఎస్పి మహేశ్వర రాజు, మచిలీపట్నం డిఎస్పీ రాజా, ఐఎంఏ డాక్టర్ పొట్లూరి వంశీ, పలు స్వచ్ఛంద సంస్థల సభ్యులు, సామాజిక సంస్థల పెద్దలు, ఐఎంఏ వైద్యులు, సైకిల్ క్లబ్ సభ్యులు, విద్యార్థుల పాల్గొన్నారు.
Comments
Post a Comment