స్త్రీ విద్యకు ఆద్యుడు పూలే: కృష్ణా విశ్వ విద్యాలయం ఉపకులపతి ఆచార్య కె రాంజీ
అఖండ భారతదేశంలో స్త్రీ విద్యకు ఆద్యుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే అని కృష్ణా విశ్వ విద్యాలయం ఉపకులపతి ఆచార్య కె రాంజీ
కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భముగా శుక్రవారం విశ్వవిద్యాలయం లో ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భముగా ఉపకులపతి రాంజీ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం రావడానికి వంద సంవత్సరాల ముందే మహిళలకు విద్య అవశ్యకతను గుర్తించి వారి కోసం పాఠశాలలు, వసతి గృహాలు కట్టించిన నిజమైన సామాజిక ఉద్యమకారుడు జ్యోతిరావు పూలే అన్నారు. అందుకే డా. బిఆర్ అంబేడ్కర్ తన గురువు ఫూలే అని ప్రకటించుకున్నారన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ బిల్లు తీసుకురావడానికి స్ఫూర్తి ఫూలే, అంబేడ్కర్ లని ప్రస్తుతించారు.
ఈ కార్యక్రమంలో రెక్టర్ ఆచార్య ఎంవి బసవేశ్వరరావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎన్ ఉష తదితరులు ప్రసంగించారు. ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాంబాబు, సహాయ ఆచార్యులు దుర్గా ప్రసాద్, శాంతి కృపా, కవిత, రామాంజనేయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్ధులు పాల్గొన్నారు.
శ్యామ్ కాగిత,
9247033394
Comments
Post a Comment