Skip to main content

వాయు కాలుష్య నివారణకు వారానికి ఒకసారైనా సైకిల్ వాడి వాయు నాణ్యత పెంచాలి: జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

వాయు కాలుష్య నివారణకు వారానికి ఒకసారైనా  సైకిల్ వాడి వాయు నాణ్యత పెంచాలి: జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ



వాయు కాలుష్యం నివారించుటకు ప్రతి ఒక్కరూ వారానికి ఒకసారి అయినా సైకిల్ వాడి వాయు నాణ్యత పెంచాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. 

స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం నగరంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కలెక్టరేట్ లోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్నారు. 


తొలుత జిల్లా కలెక్టర్ తన భద్రత, క్యాంపు సిబ్బందితో కలిసి సైకిల్ పై కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి బయలుదేరి కలెక్టరేట్కు చేరుకున్నారు. 

తదుపరి జిల్లా కలెక్టర్ వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సిబ్బందితో కలిసి కలెక్టరేట్లో ఈవీఎం గోదాము వెనకవైపు, డిఎస్ఓ, సర్వే భూ రికార్డుల కార్యాలయాల చుట్టుపక్కల చెత్తాచెదారాలను తొలగించి ట్రాక్టర్లకు ఎక్కించారు. 


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల 3 వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతినెల ఒక ఇతివృత్తం (థీమ్ )ఎంచుకొని ఆ ప్రకారంగా వివిధ స్వచ్ఛత కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. 

ఇందులో భాగంగా గత 2 నెలలుగా ఉన్న ఇతివృత్తాలను ప్రతినెల 3 వ శనివారం వరకే పరిమితం చేయకుండా జిల్లాలో మిగతా శనివారాల్లో కూడా కొనసాగిస్తున్నామన్నారు. మొట్టమొదటి నెల అక్టోబర్ నెలలో వాయు కాలుష్యం ప్రధాన అంశంగా స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. వాయు నాణ్యత పెంచాలంటే ప్రజలందరూ చాలా వరకు సైకిల్ ను వాడాలన్నారు. ఇందులో భాగంగా ప్రతి శనివారం కలెక్టరేట్లో పని చేసే ప్రతి ఉద్యోగి నడుచుకుని గాని లేదా సైకిల్ పైన గాని రావాలని సూచించామన్నారు. 

అంతేకాకుండా విజయవాడ నుండి మచిలీపట్నం వచ్చే అధికారులు విడివిడిగా కాకుండా ముగ్గురు నలుగురు అధికారులు కలిసి ఒకే వాహనంలో రావాలని సూచించామన్నారు. 

ఈ నవంబర్ నెలలో సామాజిక హైజిన్ ఇతివృత్తంతో పనిచేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా కలెక్టరేట్ పరిసరాల్లో ప్రతి శనివారము ఉద్యోగులందరూ కలిసి చెత్తాచెదారాలను తొలగించి శుభ్రం చేయడం జరుగుతుందన్నారు. చెత్తాచెదారాలను పూర్తిగా తొలగించాక కలెక్టరేట్లో సుందరీకరణ పనులు చేపడతామన్నారు. ఒకసారి చెత్తాచెదారాలు తొలగించాక మరల కలెక్టరేట్లో ప్రాంగణంలో చెత్త కనబడకుండా తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 


ఈ కార్యక్రమంలో డీఎస్ఓ మోహన్ బాబు, బీసీ సంక్షేమ అధికారి రమేష్, భూ సర్వే రికార్డుల ఏడి జోషిలా, బీసీ కార్పొరేషన్ ఈడీ రాజేంద్ర, సమాచార పౌర సంబంధాల శాఖ డిడి వెంకటేశ్వర ప్రసాద్, జిల్లా పర్యాటక అధికారి రామ్ లక్ష్మణ్, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, సహాయ కమిషనర్ గోపాలరావు, కలెక్టరేట్ ఏవో రాధిక కలెక్టరేట్లోని వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...