కృష్ణ విశ్వవిద్యాలయ పరిధిలో ఎల్ ఎల్ బి- 2, బిఏ ఎల్ఎల్ బి-2,6 సెమిస్టర్ ఫలితాల విడుదల
కృష్ణ విశ్వవిద్యాలయ పరిధిలో అనుబంధ కళాశాలకు సంబంధించి ఎల్ ఎల్ బి- 2, బిఏ ఎల్ఎల్ బి-2,6 సెమిస్టర్ ఫలితాలను శనివారం, 29, నవంబర్ 2025న విశ్వవిద్యాలయ ఉప కులపతి ఆచార్య కే రాంజీ ఆదేశాల మేరకు విడుదల చేయడం జరిగిందని పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ పి బ్రహ్మచారి తెలియజేశారు ఎల్ఎల్బి - 2 సెమిస్టర్ 261 మంది హాజరు కాగా 77.78 శాతం ఉత్తీర్ణులైనారు. బి ఏ ఎల్ ఎల్ బి -2 సెమిస్టర్ 131 మంది హాజరు కాగా 87.79% ఉత్తీర్ణత, బి ఏ ఎల్ ఎల్ బి -6 సెమిస్టర్ 85 మంది హాజరు కాగా 94.12% ఉత్తీర్ణత అని పరీక్ష నియంత్రణ అధికారి వీర బ్రహ్మచారి తెలియజేశారు. పునః మూల్యాంకనం కొరకు దరఖాస్తు చేసుకునేవారు 8,డిసెంబర్ 2025వరకు www.kru.ac.in వెబ్సైట్లో సూచించిన రుసుమను చెల్లించి దరఖాస్తు చేసుకొన వచ్చని పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ పి వీర బ్రహ్మచారి తెలియజేశారు
మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...
Comments
Post a Comment