Skip to main content

Posts

పుచ్చకాయ జ్యూస్, సుగంధి విక్రయించిన జిల్లా కలెక్టర్ కుమార్తె

Recent posts

పిఎన్‌జి అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో 90 రోజుల్లో కన్వర్షన్ పూర్తి చేయాలి : జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ కుమార్

జిల్లాలో ఎల్‌పిజి నుండి పిఎన్‌జి వైపు మారాలి మచిలీపట్నం : జిల్లాలో వినియోగదారులు, వ్యాపార సంస్థలు ఎల్‌పిజి గ్యాస్ వినియోగాన్ని తగ్గించి, పైపుల ద్వారా సరఫరా అయ్యే సహజ వాయువు పిఎన్‌జి అదేవిధంగా ఇతర విద్యుత్ ఆధారిత వంట పరికరాల వినియోగం వైపు మళ్లాలని జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ కుమార్ కోరారు. సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ మీకోసం కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటికే నాగాయలంక రిఫైనరీల నుండి సుమారు 450 కిలోమీటర్ల మేర పిఎన్‌జి పైప్‌లైన్ అందుబాటులో ఉన్నందున, ఆ సౌకర్యాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలోని మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు, వైఎస్సార్ తాడిగడప మున్సిపల్ పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఆసుపత్రులు, పరిశ్రమలు తక్షణమే పిఎన్‌జి వినియోగానికి మారాల్సిన అవసరం ఉందన్నారు. పిఎన్‌జి కనెక్షన్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లోని సంస్థలు 90 రోజులలోపు పిఎన్‌జికి మారకపోతే, వారి ఎల్‌పిజి కనెక్షన్లను డిస్‌కనెక్ట్ చేసే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో పిఎన్‌జికి మారాల్సిన 417 పరిశ్రమలు, 179 ఆసుపత్రులు/నర్సింగ్ హోమ్‌లు, 8 ప్రధాన దేవాలయా...

పేదవారికి సొంత ఇంటి కల నెరవేర్చడం కూటమి ప్రభుత్వ లక్ష్యం

2029 నాటికి ప్రతి పేదవారికి సొంతిల్లు ఏర్పాటే లక్ష్యంగా ప్రభుత్వం 21నెలల్లో 5లక్షల ఇళ్లు పేదలకు అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిది కృష్ణా జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి  మచిలీపట్నం : రాష్ట్రంలోని ప్రతి పేదవారికి సొంతిటి కలను నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని కృష్ణ జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి అన్నారు. సోమవారం మచిలీపట్టణం లోని జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షులు, అధికార ప్రతినిధులు, జిల్లా సోషల్ మీడియా కోర్డినేటర్ లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూటమి ప్రభుత్వం సొంతఇల్లు ఇస్తోంది. పి ఎం ఏ వై, బి ఎల్ సి,అర్బన్ స్కీమ్ ద్వారా లబ్ధిదారుడు బాలరాజు రూ.2.50లక్షలతో ఎన్టీఆర్ గృహాన్ని నిర్మించుకున్నారు. పేదల సొంత ఇంటి కల నెరవేర్చడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని, ఆ దిశగా ఆయన ముందుకు వెళ్తున్నారని అన్నారు. గత వైసీపీ పాలనలో ...

కృష్ణాజిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారిణి గా జే అరుణ

మచిలీపట్నం : ఇప్పటివరకు కృష్ణాజిల్లా పంచాయతీ అధికారినిగా పనిచేస్తున్న జే అరుణకు ప్రమోషన్ ఇచ్చి కృష్ణా జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారిణి గా నియమించారు. ఇటీవల ఆమె పనితీరును స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించి ప్రమోషన్ ఇచ్చి ఈ విధులను అప్పగించారు.

పరీక్షా కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన డిఇఓ

మచిలీపట్నం : కృష్ణాజిల్లా డిఇఓ యు వి సుబ్బారావు సోమవారం పరీక్ష కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. సోమవారం నిర్వహించిన పదవ తరగతి సోషల్ స్టడీస్ పరీక్ష సందర్భంగా కృష్ణా జిల్లా విద్యాశాఖ అధికారి యు.వి. సుబ్బారావు జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను సందర్శించారు. మచిలీపట్నం మండలంలోని సెయింట్ జాన్స్ హై స్కూల్, సిపిఎంహై స్కూల్, భాష్యం హై స్కూల్, బాలాజీ విద్యాలయం, నగరపాలక సంస్థ హై స్కూల్ దేశాయిపేట, నారాయణ హై స్కూల్ వంటి రెగ్యులర్ పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. అదేవిధంగా, భాష్యం హై స్కూల్, బాలాజీ హై స్కూల్ మరియు నారాయణ హై స్కూల్ లో నిర్వహిస్తున్న మూడు ఓపెన్ స్కూల్ పరీక్షా కేంద్రాలను కూడా సందర్శించారు. మొత్తం 9 పదవ తరగతి పరీక్షా కేంద్రాలను సందర్శించిన అనంతరం, పరీక్షల నిర్వహణ విధానం, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు భద్రతా ఏర్పాట్లను సమీక్షించి, సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించబడ్డాయని తెలిపారు.

అక్రమంగా మడ అడవుల తవ్వకం పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన పేర్ని నాని

విలేఖరి ఉప్పందించడంతో పారిపోయిన అక్రమ తవ్వకందారులు మచిలీపట్నం : మచిలీపట్నం మండలంలో మడ అడవులు అక్రమ తవ్వకాలపై కృష్ణాజిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు పేర్ని వెంకట్రామయ్య (నాని) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పెదపట్నం, కానూరు ప్రాంతంలో మడ అడవులు తవ్వకాలపై సమాచారం అందుకున్న నాని హుటాహుటిన తవ్వకాల ప్రాంతానికి చేరుకున్నారు. అయితే ఇంతలో అక్రమ తవ్వకాదారులు తవ్వకాలను నిలిపివేసి అక్కడి నుంచి హుటా హుటిన పారిపోయారు. దీనిపై పేర్ని వెంకట్రామయ్య (నాని) జాయింట్ కలెక్టర్ నవీన్ కు తవ్వకాల పై ఫిర్యాదు చేశారు. అనంతరం పేర్ని విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఉన్న గ్రామస్థాయి నాయకులు ఎకరం సాగు చేస్తున్న రైతులను కమిషన్ల కోసం వేధిస్తున్నారు అని అన్నారు. మండలంలోని మడ అడవులను ధ్వంసం చేస్తున్నా ఆర్డీవో పట్టించుకోవడంలేదని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మడ అడవులను తొలగిస్తున్న నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్న ఆర్డీవో తీరును ఘాటుగా పేర్ని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల కోసమే పని చేయాలన్నారు. మడ ప్రాంతంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాదు చేయగానే ఆయన వెంటన...

వేసవిలో ప్రజలకు తాగునీరు అందించేందుకు ప్రణాళిక రాష్ట్రమంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం : గత ఐదు సంవత్సరాలలో ప్రజలు మౌలిక వసతులు అందక తీవ్ర ఇబ్బందులు పడ్డారని రాష్ట్ర గనులు భూగర్భ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో నగరంలో చివర ప్రాంతాలకు నీరు అందించేందుకు ప్రత్యేకమైన రెండు వాటర్ ట్యాంకర్లను నగరపాలక సంస్థ నుండి నీటిని సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన రెండు నీటి సరఫరా వాహనాలను ఆయన నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. గత ఐదు సంవత్సరాలు నిర్లక్ష్యాన్ని గురైన మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం నేడు ప్రత్యేక అధికారి కలెక్టర్ ద్వారా ప్రజల సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.