Skip to main content

పేదవారికి సొంత ఇంటి కల నెరవేర్చడం కూటమి ప్రభుత్వ లక్ష్యం


2029 నాటికి ప్రతి పేదవారికి సొంతిల్లు ఏర్పాటే లక్ష్యంగా ప్రభుత్వం
21నెలల్లో 5లక్షల ఇళ్లు పేదలకు అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిది
కృష్ణా జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి 

మచిలీపట్నం :

రాష్ట్రంలోని ప్రతి పేదవారికి సొంతిటి కలను నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని కృష్ణ జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి అన్నారు. సోమవారం మచిలీపట్టణం లోని జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షులు, అధికార ప్రతినిధులు, జిల్లా సోషల్ మీడియా కోర్డినేటర్ లతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూటమి ప్రభుత్వం సొంతఇల్లు ఇస్తోంది. పి ఎం ఏ వై, బి ఎల్ సి,అర్బన్ స్కీమ్ ద్వారా లబ్ధిదారుడు బాలరాజు రూ.2.50లక్షలతో ఎన్టీఆర్ గృహాన్ని నిర్మించుకున్నారు. పేదల సొంత ఇంటి కల నెరవేర్చడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని, ఆ దిశగా ఆయన ముందుకు వెళ్తున్నారని అన్నారు. గత వైసీపీ పాలనలో పేదల ఇంటి కలను నిర్వీర్యం చేశారు. ఎన్టీఆర్ గృహాల లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకుంటే నాటి వైసీపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల నోట్లో మట్టి కొట్టింది. పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ మరోవైపు అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతోంది. నియోజకవర్గంలో ఉన్న అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఇల్లు మంజూరు చేయిస్తాం. అందులో భాగంగానే పదివేల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మడకశిర నియోజకవర్గంలో పండుగ వాతావరణం లో జరిగింది. 

కృష్ణా జిల్లాలో 78,860 మంది బంగారు కుటుంబాలను గుర్తిస్తే వారిలో 44,270 బంగారు కుటుంబాలకు 2,093 పి ఫోర్ మార్గదర్శకుల ద్వారా వారికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నాము. గుడివాడలో మెగా కంపెనీ గుడ్లవల్లేరు ప్రాంతంలో సుమారు 1500 కుటుంబాలను దత్తత తీసుకుంది. గన్నవరంలో HCL వాత్సల్య మహిళా మండలి ద్వారా గన్నవరంలో మహిళలకు కుట్టు మిషన్లు అల్లికల ద్వారా వారికి స్వయం జీవనోపాదం కల్పించారు. పెనమలూరులో అనుమోలు ప్రభాకర్ దాదాపు 15 లక్షల తోటి స్కూల్ కట్టించి, 50 లక్షల P 4 కార్యక్రమానికి ఇచ్చారు. అంతేకాకుండా 35 ట్రైబల్ కుటుంబాలను తీసుకొని వారికి ఆర్థిక భరోసా ఇచ్చారు. పెడన నియోజవర్గంలోని కప్పలదొడ్డి ప్రాంతంలో బత్సల్య మహిళా మండలి ద్వారా అల్లికలు మహిళలకు ఉచిత శిక్షణ ఇచ్చి వారికి జీవనాధారం చూపించారు. మచిలీపట్నంలో కొల్లు ఫౌండేషన్ ద్వారా కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ పేద బడుగు బలహీన వర్గాలకు ఆర్థికంగా బలపరుస్తున్నారు. ఎన్టీఆర్ మెమొరల్ ట్రస్టు ద్వారా గుడివాడ పామర్రు మచిలీపట్నం పెనమలూరు ప్రాంతాలలోని హాస్పటల్ కు సుమారు 1200 యూనిట్ల బ్లడ్ అందజేయడం జరిగింది. ఈ ట్రస్ట్ ద్వారా ఉచిత కంటి ఆపరేషన్లు వారికి కళ్ళజోడు పంపిణీ చేయడం కూడా జరిగినది. ఈ విధంగా పి ఫోర్ కార్యక్రమంలో అనేకమంది మార్గదర్శకులు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి  తోడ్పడుతున్నారని అన్నారు.

 ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు మువ్వ వెంకటేశ్వరరావు, గుత్త శివరామకృష్ణ, మండపాక శంకర్ బాబు, వంగవీటి శ్రీనివాస్ ప్రసాద్ , జిల్లా కార్యాలయ కార్యదర్శి బత్తినదాస్, అధికార ప్రతినిధులు సొంటి రామకృష్ణ, రావి రత్నగిరి, పేర్ల కోస్తా మురళి కృష్ణ, తుమ్మలపల్లి హరికృష్ణ, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఉప్పలపాటి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...