Skip to main content

వంతెన నిర్మాణాలలో నాణ్యత పాటించాలి.... జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

మచిలీపట్నం :

వంతెన నిర్మాణాల్లో తప్పనిసరిగా నాణ్యత ప్రమాణాలు పాటించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. 

బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ గూడూరు మండలంలోని పెడన....పర్ణశాల ప్రధానమంత్రి సడక్ యోజన రహదారి మార్గంలో 3.38 కోట్ల రూపాయల వ్యయంతో పంచాయితీరాజ్ శాఖ నిర్మిస్తున్న 32 మీటర్ల వంతెనను పరిశీలించారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిర్మాణంలో ఉన్న వంతెనకు రీబౌండ్ హేమర్ కాంక్రీట్ పరీక్షను నిర్వహించారు. నాణ్యత ప్రమాణాలను వంతెన పైభాగాన క్రింది భాగాన సంబంధిత పరికరంతో స్వయంగా పరిశీలించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్రింది భాగంలో నీటితో క్యూరింగ్ చేయడంతో బాగా దృఢంగా ఉందని, పైభాగాన ఇంకా నీటితో క్యూరింగ్ చేయవలసింది ఉందని సూచించారు. వంతెన నిర్మాణంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడరాదని నాణ్యత ప్రమాణాలు విధిగా పాటించి నిర్మించాలన్నారు. 

తాను ఈ మార్గంలో వెళ్లే సమయంలో మరలా ఒకసారి నాణ్యతను పరిశీలిస్తామన్నారు. చివరి బిల్లు చెల్లింపు చేసే ముందు కూడా పరీక్షిస్తామని అధికారులకు స్పష్టం చేశారు.

ఈ పర్యటనలో కలెక్టర్ వెంట పంచాయతీరాజ్ ఎస్ ఈ రమణ రావు,, గూడూరు మండల తహసిల్దారు రాజ్యలక్ష్మి, ఎంపీడీవో శైలజ కుమారి, పంచాయతీరాజ్ శాఖ డి ఈ ఈ నాగరాజు, ఏఈ గోపి తదితర అధికారులు అనధికారులు పాల్గొన్నారు.

Comments