Skip to main content

రెవిన్యూ క్లినిక్ల అర్జీలను సత్వరమే పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ


మచిలీపట్నం :

జిల్లాలో పెండింగ్లో ఉన్న 430 రెవెన్యూ క్లినిక్ అర్జీలను సత్వరమే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

మంగళవారం జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ ఎం నవీన్ తో కలసి నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశం మందిరంలో రెవెన్యూ అధికారుల సమావేశం నిర్వహించి రెవెన్యూ క్లినిక్లు, కోర్టు కేసులు, మీకోసం... పిజిఆర్ఎస్ అర్జీల పరిష్కారం, కుటుంబ ధ్రువీకరణ పత్రం, ఈ...కార్యాలయం, ముటేషన్లు, పట్టాదారు పాసుపుస్తకాలు, 22 ఏ భూములు, రీసర్వే, ఇళ్ల స్థలాలు, సీనియర్ సిటిజన్, ఎన్నికలు తదితర అంశాలపై మండలాల వారీగా సుదీర్ఘంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రెవెన్యూ క్లినిక్ల సందర్భంగా 804 దరఖాస్తులు అందాయని, వాటిలో ఇప్పటివరకు 106 దరఖాస్తులు పరిష్కరించడం జరిగిందన్నారు. మరో 61 దరఖాస్తులు అంగీకరించి తదనుగున ప్రక్రియలో ఉండగా 207 దరఖాస్తులు తిరస్కరించగా 430 దరఖాస్తులు ఇంకను పెండింగ్లో ఉన్నాయన్నారు. దరఖాస్తుల పరిష్కారంలో ఎందుకంత ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నిస్తూ వాటిపై ప్రత్యేక దృష్టి సారించి త్వరగా పరిష్కరించాలన్నారు.
ఎఫ్ఎల్ ఆర్ , ఆర్ ఎస్ ఆర్ రికార్డులు పరిశీలిస్తే చాలా వరకు దరఖాస్తులు పరిష్కరించవచ్చని సూచించారు. 
మీకోసం అర్జీలు 13,360 అందగా అందులో 11,468 అర్జీలు పరిష్కరించాలని, అందులో 348 అర్జీలు గడువు దాటి ఉన్నాయన్నారు. ఇకనైనా అర్జీలను నిర్ణీత గడువులోగానే పరిష్కరించాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం 22- ఏ నిషేధిత భూముల పై అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని, జిల్లాలో ఇప్పటివరకు ఆ జాబితా నుండి తొలగించాలని 446 దరఖాస్తులు వచ్చా యని, అందులో అత్యధికంగా బాపులపాడు మండలంలో ఉన్నాయని, వాటన్నిటిని పరిశీలించి సజావుగా పరిష్కరించాలన్నారు.

జిల్లాలో 573 రిట్ పిటిషన్లకు కౌంటర్లు ఇంకను వేయాల్సి ఉందని, ఇకపై ఎలాంటి ఆలస్యం, అశ్రద్ధ చేయకుండా కౌంటర్ అఫిడవిట్లు 10 రోజుల్లో తయారుచేసి కోర్టుకు సమర్పించాలన్నారు. జిల్లాలో హిట్ రన్ 21 కేసులు, సీనియర్ సిటిజన్ కేసులు త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక తీవ్రతర సవరణ( ఎస్ఐఆర్) కార్యక్రమం లో భాగంగా 4.5 లక్షల ఓటర్లను మ్యాపింగ్ ఇంకా చేయవలసి ఉందన్నారు. 
సంయుక్త కలెక్టర్ ఎం నవీన్ మాట్లాడుతూ రీ సర్వేలో ఎఫ్ లైన్ ప్రక్రియ సరిగా పరిశీలన చేయడం లేదని ఇకనైనా సరిగా గమనించి చేయాలన్నారు. అడంగల్ సరిదిద్దడంలో గాని, ముటేషన్లు చేయడంలో గాని ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు. రెవెన్యూ క్లినిక్లు ఏర్పాటు చేసిన ఉద్దేశం ప్రజలకు త్వరగా మేలు జరగాలని కానీ ఆ ప్రయోజనం నెరవేరడం లేదన్నారు.

దీంతో ప్రజల సానుకూల దృక్పథం లో రెవెన్యూ శాఖకు 59% మాత్రమే ఉందన్నారు. కోర్టు ధిక్కరణ కేసులు 31 పెండింగ్లో ఉన్నాయని వాటికి సంబంధించి వెంటనే కౌంటర్లు దాఖలు చేయాలన్నారు. మీకోసం అర్జీలలో ఎక్కువగా నాగాయలంక, గుడ్లవల్లేరు మండలాల్లో పెండింగ్ లో ఉన్నాయని, గడువు వచ్చేంతవరకు ఆగకుండా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోనే పరిష్కరించాలన్నారు. తాజా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రస్తుతం 22- ఏ భూముల జాబితాలో ఉన్న ఏపీఐఐసీ స్థలాలను తొలగించాలన్నారు.

ఈ సమావేశంలో డిఆర్ఓ చంద్రశేఖర రావు మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు ఆర్డీవోలు సాంబశివరావు, బాలసుబ్రమణ్యం, శ్రీదేవి, విజిలెన్స్ అధికారి పీజిఆర్ఎస్ నోడల్ అధికారి పోతురాజు, ప్రొబేషనరీ ఉప కలెక్టర్ నిఖిల శ్రీ, సర్వే భూ రికార్డుల ఏ డీ లక్ష్మణ్ బాబు, ఏపీఐఐసీ జెడ్.ఎమ్. బాబ్జి, పలువురు మండల తహసిల్దారులు, మున్సిపల్ కమిషనర్లు, సర్వేయర్లు, డీటీలు పాల్గొన్నారు. 

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...