Skip to main content

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాలి.... మంత్రి కొల్లు రవీంద్ర.



మచిలీపట్నం :

 పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం నగరంలోని కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో అమృత కృష్ణ పేరుతో నూతనంగా ఏర్పాటు చేసిన స్వచ్ఛమైన నీటి బాటలింగ్ యూనిట్ ను రాష్ట్ర మంత్రివర్యులు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ రాను రాను పర్యావరణం కలుషితం అవుతుందని, పర్యావరణాన్ని పరిరక్షించుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. చిన్నతనంలో బోరింగులు ఎక్కడపడితే అక్కడ నీరు తాగే వారమన్నారు. నేడు అలాంటి పరిస్థితి లేదన్నారు. స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహార అందేలా చూసుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తమన్నారు.
ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వాడకం పెరిగిపోయిందని హోటల్లో పార్సల్లు అన్నీ కూడా క్యారీ బ్యాగుల్లోనే సరఫరా అవుతున్నాయన్నారు. ప్లాస్టిక్ మట్టిలో కలవాలంటే కొన్ని వందల సంవత్సరాలు పడుతుందని ఈ విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు.
ప్రస్తుతం కలెక్టరేట్లో స్వచ్ఛమైన నీటి బాటలింగ్ యూనిట్ ఏర్పాటు చేయడం ఒక మంచి ఆలోచన అని అందుకు చొరవ తీసుకున్న జిల్లా కలెక్టర్ డీకే బాలాజీని ధైర్యం చేసి బాటలింగ్ యూనిట్ ఏర్పాటు చేసుకున్న మహిళ జీవామృతను మంత్రి అభినందించారు. 
ప్రభుత్వపరంగా ఆమెకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. 

ప్రభుత్వానికి మహిళలపై పూర్తి నమ్మకం ఉందని, వారు తీసుకున్న రుణాలు తిరిగి చెల్లిస్తారన్నారు. ఆమె బాటిలింగ్ యూనిట్ తప్పకుండా విజయవంతం అవుతుందన్నారు.  
జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం ఎక్కువైందని ప్లాస్టిక్ ఎక్కడపడితే అక్కడ పారవేయడం ముఖ్యంగా మురికి కాలువల్లో వేయడం వలన అక్కడ ఇరుక్కుపోయి మురుగునీరు ప్రవహించక దోమలు వృద్ధి చెందుతున్నాయన్నారు. దోమల వలన మానవులకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు. ప్లాస్టిక్ ముక్కలు ముక్కలుగా అయ్యి ఆహారంలో కలిసి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందన్నారు. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వాడకం నిలిపివేయాలని మనం ఎక్కువగా క్యారీ బ్యాగులు వాటర్ బాటిల్స్ ను వినియోగిస్తున్నామ ని వాటి వాడకం తగ్గించాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఒక కుటుంబం ఒక వ్యాపారవేత్త అనే నినాదంతో ముందుకు వెళుతుందన్నారు. ఇందులో భాగంగానే ఒక పేద మహిళలకు పీఎంఈజీపి పథకం కింద 15 లక్షల రూపాయలు రుణం మంజూరు చేయించి, ఈ బాటిలింగ్ యూనిట్ ఏర్పాటు చేయించామన్నారు. ఆ మహిళలకు స్వయం ఉపాధి లభించడంతోపాటు పర్యావరణానికి హితంగా కూడా మార్పు వచ్చిందన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు ప్రతి ఒక్కరు కూడా వారికి సంబంధించి ఏదైనా కార్యక్రమాలు ఉంటే ఈ బాటిలింగ్ యూనిట్ నుండి మంచినీటిని కొనుగోలు చేయాలన్నారు.

ప్రభుత్వం తరఫున ఏ కార్యక్రమం జరిగిన ఇదే నీటి బాటిల్ యూనిట్ నుండి నీటి సీసాలను వాడాలని నిర్ణయించుకున్నామన్నారు. ఆర్కే హోటల్లో కూడా ఈ బాటిల్ యూనిట్ నుండి నీటి సీసాలను తీసుకొని పేద మహిళలకు అండగా నిలవాలన్నారు. సీసాలు వాడాక సీసాలను తిరిగి ఇస్తే నీటి దర 6 రూపాయిలు మాత్రం వసూలు చేయడం జరుగుతుందన్నారు. కాషన్ డిపాజిట్ గా కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుందని నీటి ధర తగ్గించుకొని మిగిలిన డబ్బులు వారు చెల్లిస్తారన్నారు.

ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, డిఆర్ఓ చంద్రశేఖర రావు, డి ఆర్ డి ఎ పిడి హరిహరనాద్, మచిలీపట్నం ఆర్డిఓ సాంబశివరావు, కె వి ఐ బి ఏ డి శ్రావణ్ కుమార్, డీసీఎంఎస్ అధ్యక్షులు బండి రామకృష్ణ, అర్బన్ బ్యాంక్ అధ్యక్షులు దిలీప్ కుమార్, మచిలీపట్నం మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచే నాని, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ పలువురు మహిళలు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...