Skip to main content

పెడన మండలం స్వామిత్వ క్షేత్ర స్థాయి పరిశీలనలో జిల్లా కలెక్టర్

మచిలీపట్నం:

విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించే దిశగా ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. 

బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ పెడన మండలంలోని పెనుమల్లి గ్రామంలో విస్తృతంగా పర్యటించి ఒకవైపు ఇంటింటికి తిరిగి 9 వ తరగతి చదువుతున్న విద్యార్థుల స్థితిగతులను ఆరా తీశారు. మరోవైపు స్వామిత్వ సర్వే వివరాలను పరిశీలించారు. 
తొలుత జిల్లా కలెక్టర్ పెనుమల్లి గ్రామంలో ఇంటింటికి తిరిగి 9 వ తరగతి చదువుతూ 10వ తరగతికి వెళుతున్న విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు ఉన్నత పాఠశాలలో ప్రత్యేకించి ఏర్పాటుచేసిన బ్రిడ్జి కోర్సు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారో విచారించారు. 

తదుపరి కలెక్టర్ గ్రామంలో మూడవ తరగతి చదువుతున్న విద్యార్థిని కాగిత లాస్యను ఎలా చదువుకుంటున్నావని, ఏమవుతావని ప్రశ్నించగా తాను బాగా చదువుకుంటున్నానని, డాక్టర్ అవుతానాని కలెక్టర్ కు చెప్పారు. ఆహారం బాగా తినాలని పాఠశాలలో చిక్కి కోడిగుడ్డు ఇస్తున్నారా తింటున్నావా, రాగిజావ తాగుతున్నావా అని ప్రశ్నించగా ఆ అమ్మాయి అన్నిటికీ అవునని చాలా స్మార్ట్ గా సమాధానాలు చెప్పడంతో జిల్లా కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేస్తూ ఇలాంటి పిల్లలు ఏ కారణం చేతనైనా చదువు మధ్యలో ఆపివేస్తే వారు జీవితాంతం వెనకబడిపోయి బాధపడతారన్నారు. 
ఇటువంటి వారికి బాగా చదివించాలనీ, కనీస స్థాయి పరిజ్ఞానం తెలుసుకోవాలన్నారు. మూడు నాలుగు నెలల తర్వాత మరల వస్తానని అప్పుడు అన్ని చదివి వినిపించాలని కలెక్టర్ విద్యార్థినికి తెలిపారు.

గ్రామంలో గుర్తించిన నిర్మాణ వాలంటీర్లతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులందరికీ ఒకే విధంగా చదువు చెబుతూ ఉంటారని ఒక్కసారి అర్థం కాక వెనుకబడితే అలాగే జీవితాంతం వెనుకబడిపోతారన్నారు. అటువంటి వారికి ధైర్యం చెప్పి సరైన విధంగా ప్రోత్సహిస్తే చదువులో ముందుకు సాగుతారన్నారు.  చాలామంది విద్యార్థులు పరీక్షలు దగ్గర పడినప్పుడు చదువుతుంటారని అలా కాకుండా ముందు నుంచే చదువుకుంటే ధైర్యంగా బాగా పరీక్షలు రాయవచ్చన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ పెనుమల్లి గ్రామ సచివాలయాన్ని సందర్శించి అక్కడి స్వమిత్వా రికార్డులను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో రోవర్సు పాయింటు సరిగా ఉందో లేదో కూడా పరిశీలించారు. రెండుమూడు వీధులు తిరిగి ఇళ్ల కొలతలు సరిగా ఉన్నాయా లేదా పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు గ్రామ పంచాయతీ పన్నులు, పన్నేతర లావాదేవీలు నగదు రహితంగా చెల్లింపు ఏ విధంగా చేస్తున్నారో గమనించారు. గ్రామపంచాయతీ కార్యాలయం వద్దకు రాకుండానే స్వర్ణ పంచాయతీ పోర్టల్ ఆన్లైన్ ద్వారా పన్నులన్నీ ఇంటి వద్ద నుంచే చెల్లించే అవకాశం ఉందన్నారు. అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
తదనంతరం జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ జిల్లాలో సమిత్వా సర్వే జరుగుతుందని, సర్వే ద్వారా గ్రామ కంఠంలో ఉన్న ఇంటింటికి తిరిగి ఆస్తి హక్కు కార్డులు ఇచ్చారా లేదా సర్వే సరిగా చేశారా లేదా క్షేత్రస్థాయిలో పరిశీలన కోసం పర్యటిస్తున్నామన్నారు. 
పెనుమల్లి గ్రామపంచాయతీలో నూటికి నూరు శాతం ఆస్తి పన్నులు వసూలు చేసినందుకు సిబ్బందిని అభినందిస్తున్నామన్నారు.

ఈ పర్యటనలో కలెక్టర్ వెంట సర్వే భూ రికార్డుల ఏడి లక్ష్మణ్ బాబు, డి ఎల్ డి ఓ పద్మ, డి ఎల్ పి ఓ రజావుల్లా, తహసిల్దారు అనిల్ కుమార్, ఎంఈఓ లు హరినాథ్, సలోమి, సర్పంచ్ రామానాయుడు, జడ్పిటిసి ఆర్జా వెంకట నగేష్ తదితరులు పాల్గొన్నారు. 

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...