Skip to main content

ఆక్వా రైతుల సమస్యను అధికారులు పరిష్కరించాలి

మచిలీపట్నం, 11 మార్చి 2026, SSN:
       బుధవారం నగరంలోని  వైసీపీ కార్యాలయం లో మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ ఆక్వా  రైతుల పట్ల  జిల్లా అధికారుల వ్యవహారశైలిని తీవ్రంగా తప్పుపట్టారు.
        పేర్ని మాట్లాడుతూ.... మంత్రి కొల్లు రవీంద్రకు చెందిన ఇద్దరు అనుచరులు గత మూడు నాలుగు నెలలుగా బందరు దక్షిణ మండలంలోని పోలాటతిప్ప, పల్లె తుమ్మలపాలెం, వాడపాలెం, కోన, పాతేరు, తుమ్మలచెరువు, కే పి టి పాలెం గ్రామాల్లో చెరువులకు మరమ్మత్తులు  చేయడానికి వీలు లేదని ఆ ప్రాంతంలో సోలార్ ప్లాంట్ పెట్టే ఆలోచనలో మంత్రి ఉన్నారని అక్కడ రైతులను బెదిరిస్తున్నారని  అన్నారు 
        సమస్య పరిష్కారనికి ఆక్వా రైతులు మంత్రి కొల్లు రవీంద్ర ని కలవగా.,. మంత్రి సైతం సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని  ఆక్వా సాగు కు అవకాశం లేదు అని అన్నారని నాని అన్నారు. ఎకరాకు నలభై నుంచి యాభై వేలు లీజు వచ్చే చెరువులకు.... ఇరవై ఐదు వేలు లీజు ఇస్తామని సదరు ఇద్దరు మంత్రి వ్యక్తులు  ప్రతిపాదించారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పేర్ని తెలిపారు. 
      పేర్ని మాట్లాడుతూ...  రైతులు చెరువులు మరమ్మత్తు చేయకూడదని,  సౌత్ మండలం ఎమ్మార్వో గ్రామాల్లో పర్యటించి మౌఖిక ఆదేశాలు ఇస్తున్నారు. రూల్స్ ఏమయ్యాయి. ఆర్డీవో కి, కలెక్టర్ కి తెలిసే ఇదంతా జరుగుతున్నట్లుగా ఒక దిన పత్రికలో వార్త వచ్చింది.
       నిజంగా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసే ఆలోచనే ఉంటే జిల్లా కలెక్టర్ స్పందించాలి కానీ, టీడీపీ నాయకులు అడ్డుపడటం విడ్డూరంగా ఉంది. జిల్లా కలెక్టర్ అధికారికంగా ఎందుకు ప్రకటించలేదు. 
       చిన్న, సన్నకారు రైతులను ఇబ్బంది పెట్టె ఆలోచన విధానం మార్చుకోవాలి. చెరువులు రిపేర్ చేయనివ్వరు, కొత్తవి తవ్వనివ్వరు. మరి ఆక్వా రైతుల కుటుంబ పోషణ ఎలా జరుగుతుంది. రెవిన్యూ యంత్రాంగం రాజకీయ నాయకులకు వంత పాడే పనులు చేస్తే ప్రజలు ఎవ్వరికి చెప్పుకోవాలి.
         రెవిన్యూ యంత్రాంగం రైతాంగాన్ని ఏడిపించే పరిస్థితి వస్తే రైతులని సమీకరించి ఖచ్చితంగా రెవిన్యూ ఆఫీసులను ముట్టడిస్తాం. ఎద్దు వచ్చి చేలో మేస్తుంటే  చూస్తూ ఊరుకోం.. ముళ్ళ కర్ర పెట్టి అదిరిస్తాం... హే హే అని అరుస్తాం.... భయపడి పోతుందేమో అని, కానీ బరితెగించి ఇంకా మేస్తుంటే , ఖచ్చితంగా ముళ్లకర్ర పెట్టి తోలటం ఖాయం అనేది గుర్తుపెట్టుకోండి.
        రైతులకి చెరువులు మరమ్మత్తు చేసుకోవడానికి వేసవికాలం  అనువైన కాలం. రైతు కడుపు కాలితే ఊరుకోడు, తిరగబడతాడు అని గుర్తుపెట్టుకోండి. కార్యాలయాలు ముట్టడి చేస్తాం, మీరు తప్పుడు కేసులు పెడితే...  జైలు  నింపుతాం అని పేర్ని హెచ్చరించారు.
        ఆక్వా రైతాంగం సమస్యలు విని అధికారులు రైతులకు న్యాయం చేయాలని నాని విజ్ఞప్తి చేశారు.

https://youtu.be/Tacvj-0oK2g?si=hxSUNnqCQQU-4a7h

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...