Skip to main content

చిత్ర జగతిలో పున్నమి రేడు.. సింగిల్ స్ట్రోక్ ఆర్టిస్ట్ దామెర్ల రామారావు – కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కే. రాంజీ

మచిలీపట్నం, 09 మార్చి 2026, SSN:

ఆధునిక చిత్రకళ పేరు చెప్పగానే గుర్తొచ్చే పేరు కేరళకు చెందిన రాజా రవివర్మ అని ఆయనతో సమానమైన ప్రతిభ ఉన్న తెలుగు చిత్రకారుడు దామెర్ల రామారావు మాత్రమే నని కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాంజీ కొనియాడారు.

ఆంధ్ర శైలి చిత్ర లేఖనానికి మార్గదర్శకుడైన దామెర్ల రామారావు 129 వ జయంతి, మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ ( మా) 11వ వార్షికోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం కృష్ణాజిల్లా మచిలీపట్నం సన్ స్టార్ స్కూల్లో ఒకరోజు ఆర్ట్ వర్క్ షాప్, జిల్లాస్థాయి చిత్రకళా పోటీలలో విజేతలైన బాల బాలికలకు బహుమతుల ప్రధానం, ప్రముఖ చిత్ర కళాకారుల పెయింటింగ్స్ ప్రదర్శన ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కె .రాంజీ తొలుత ప్రసంగిస్తూ, చిత్రించిన ప్రతీది గొప్ప బొమ్మా కాదు, చిత్రించే ప్రతీవాడూ గొప్ప చిత్రకారుడు కాలేడన్నారు. కేవలం దామెర్ల రామారావు వంటి మహనీయులు చేసిన పని కాలానికి కట్టుపడనిదన్నారు. మనిషి మనసు కు శాంతినివ్వడానికి ఇవ్వబడినదని, మనిషి ఎల్లకాలం ఉండడు. గొప్ప కళ ఎప్పటికీ ఉంటుందన్నారు. ఆ కళ తనున్నంత కాలం తన సరసన ఆ మనిషి పేరును నిలిపి పెడుతుందన్నారు.

 అనంతరం కడప యోగి వేమన యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ విభాగపు ప్రొఫెసర్ మృత్యుంజయరావు మాట్లాడుతూ, చిత్రకళావైభవానికి వన్నెతెచ్చిన చిత్రకారుడు దామెర్ల రామారావు జయంతి సభ ఘనం గా నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు .తెలుగు జాతి చిత్రకళావైభవానికి వన్నెతెచ్చిన చిత్రకారుల్లో దామెర్ల రామారావు ఒకరని అంతటి కళాకారుడు జీవించింది 28 ఏళ్ల అతి కొద్ది కాలమైనా.. ఆ కొద్ది కాలంలోనే చిత్రకళకు ఆయన చేసిన సేవ మరువలేనిదన్నారు.

తర్వాత మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ ( మా ) వ్యవస్థాపకులు, ప్రముఖ మ్యుజిషియన్ చిత్రకారులు కోసూరు మాధవ్ మాట్లాడుతూ, గత 11 ఏళ్లుగా తమ అకాడమీ కార్యదర్శి బి ఎస్ వి రమేష్ తో కలసి పలు కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వర్ధమాన చిత్రకారులను ప్రోత్సాహించి వారి ప్రతిభను మరింతగా సానబట్టడమే తమ అకాడమీ ప్రధాన లక్ష్యమన్నారు.

 అనంతరం దామెర్ల రామారావు స్మారక అవార్డును మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ వ్యవస్థాపకులు, కోసూరు మాధవ్ కు అందచేసి ఆయనను ఘనంగా సత్కరించారు. యోగి వేమన విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మృత్యుంజయరావు, కృతివెన్ను జిల్లా పరిషత్ హై స్కూల్ ఉపాధ్యాయురాలు స్వర్ణలత, గూడూరు జడ్పీహెచ్ఎస్ టీచర్ అరుణ, తెలుగు సినీ చిత్ర పరిశ్రమలో ఆర్ట్ డైరెక్టర్ చిత్రకారులు కోటి, రాజమండ్రికి చెందిన రిటైర్డ్ డ్రాయింగ్ టీచర్ కరణం నూకరాజు, కాకినాడ జిల్లా కిర్లంపూడికి చెందిన వైవిద్య వాష్ డ్రాయింగ్ చిత్రకారులు కె. నాగేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్ నందం రామారావు , సెన్సార్ బోర్డు మెంబర్ వడ్డీ ఓం ప్రకాష్, తులసి హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్ చేస్తున్న విశిష్ట సేవలను గుర్తిస్తూ ఆ సంస్థ నిర్వాహకులు బొడ్డు తులసి రామ్ తదితరులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందచేశారు .

ఈ కార్యక్రమంలో కృష్ణా యూనివర్సిటీ రిజిస్ట్రర్ ఉషా, మచిలీపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ పెద్దిరాజు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా న్యూస్ జర్నలిస్ట్ అసోసియేషన్ అఫ్ ఆంధ్రప్రదేశ్ ( పెన్ యూనియన్ ) రాష్ట్ర అధ్యక్షులు , సీనియర్ జర్నలిస్ట్ బడే ప్రభాకరరావు, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వడ్డీ జితేంద్ర, నాగేశ్వరమ్మ లక్ష్మీ కుమారి ఉషా లక్ష్మి రాంబాబు సత్యదేవ్ నూకరాజు శర్మ మోహన ప్రియ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...