Skip to main content

కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి కృషి చేస్తోంది-నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్

మాజేరులో మినుములు, పెసల కొనుగోలు కేంద్రం ప్రారంభం

చల్లపల్లి: 

       కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి కృషి చేస్తోందని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. బుధవారం చల్లపల్లి మండలం కొత్తమాజేరులోని రైతు సేవా కేంద్రంలో వ్యవసాయ శాఖ పర్యవేక్షణలో మార్క్ ఫెడ్, నాఫెడ్ ఆధ్వర్యంలో మినుములు, పెసల కొనుగోలు కేంద్రాన్ని మార్క్ ఫెడ్ డీఎం విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మండలి వెంకట్రామ్ మాట్లాడుతూ ప్రభుత్వం మార్కెట్లో మినుములు, పెసల ధరల నియంత్రణకు కనీస మద్దతు ధర ప్రకటించి, కొనుగోళ్లు ప్రారంభించినట్లు తెలిపారు. పెసలు క్వింటాలుకు రూ.8,768లు, మినుములు క్వింటాలుకు రూ.7,800లు ధర చెల్లిస్తుందని వివరించారు. ఈ సీజనులో ఇప్పటివరకు చల్లపల్లి మండలంలో రూ.45కోట్లకు పైగా ధాన్యం సొమ్ము రైతు ఖాతాలకు జమ చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వ పెట్టుబడి సహాయం అన్నదాత సుఖీభవ ద్వారా మండలంలో 4,876 మంది రైతులకు రూ.2.43కోట్లు, పీఎం కిసాన్ ద్వారా రూ.96లక్షలు అందించినట్లు తెలిపారు. డ్రోన్ల కొనుగోలుకు ప్రభుత్వం మూడు సంఘాలకు రూ.29.40 లక్షలు సబ్సిడీ ఇచ్చినట్లు తెలిపారు. ఇవే కాకుండా సబ్సిడీపై మినుము విత్తనాలు, కలుపు మందులు, వేప నూనె, పురుగు మందులు అందించినట్లు తెలిపారు. 
       మార్క్ ఫెడ్ డీఎం మురళీ కిషోర్ మాట్లాడుతూ మాజేరులో 300 ఎకరాల్లో పెసలు సాగు చేసిన నేపథ్యంలో ఈ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మినుములు, పెసల కొనుగోలు, సొమ్ము చెల్లింపుల గురించి రైతులకు వివరించారు.

       మండల వ్యవసాయ శాఖ అధికారి కే.మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్ పర్సన్ తోట కనకదుర్గ, వైస్ ఎంపీపీ మోర్ల రాంబాబు, చల్లపల్లి సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి, పీఏసీఎస్ చైర్మన్ తిరుమలశెట్టి బాల నాగేశ్వరరావు, సీఈఓ ఎస్.ఎస్.చక్రపాణి, గ్రామ ప్రముఖులు కళ్లేపల్లి లక్ష్మీనారాయణ, నారాయణ సేవా సమితి నిర్వాహకులు శ్రీకాంత్, గోపాలమిత్ర ఎఫ్.పీ.సీ చైర్మన్ మాలెంపాటి రంగారావు, లంకమ్మ దేవస్థానం చైర్మన్ అన్నపరెడ్డి వెంకటస్వామి, జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు బండి నాగార్జున, నాయకులు యడ్లపల్లి బుజ్జి, బొర్రా అగ్గిరాముడు, కమ్మిలి పెదబాబు, పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఓ, ఆయా శాఖల సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...