Skip to main content

మీకోసం’ కార్యక్రమంలో అర్జీలు స్వీకరించిన జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ కుమార్


మచిలీపట్నం :

జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, అర్జీలను వేగవంతంగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ కుమార్ అధికారులను ఆదేశించారు.

సోమవారం ఉదయం కలెక్టరేట్లోని పీజీఆర్‌ఎస్ సమావేశపు మందిరంలో ఆయన ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం కార్యక్రమం నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో ఆయనతో పాటు జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖరరావు, విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ పోతురాజు, బందరు డీఎస్పీ జి శ్రీనివాసరావు అర్జీలు స్వీకరించారు. ప్రజల నుంచి అందిన ప్రతి అర్జీపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, వారి సమస్యలను సమయానికి త్వరితగతిన పరిష్కారానికి కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ సూచించారు.

అర్జీలలో కొన్ని: 

గుడివాడ మండలం, లింగవరం గ్రామానికి చెందిన కలపాల చిలకమ్మ పిజిఆర్ఎస్ సమావేశపు మందిరం వెలుపల అర్జీతో నిరీక్షిస్తున్న ఆమె సమస్యను జాయింట్ కలెక్టర్ స్వయంగా వెళ్లి అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో ఒక కాలు కోల్పోయానని, ప్రస్తుతం ప్లాస్టిక్ కాలు పరికరం సహాయంతో జీవనం సాగిస్తున్నానని, పింఛను ఇప్పించాలని కోరగా, ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందగానే పింఛను మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు. అదేవిధంగా ఆమెకు తక్షణమే మూడు చక్రాల సైకిల్ ను మంజూరు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

భారత రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా వెట్టిచాకిరి చేయించుకుంటూ ఎల్పిజి గ్యాస్ డీలర్ల వద్ద పని చేసే కార్మికులకు గ్యాస్ కంపెనీ డీలర్లు వేతనాలు ఇవ్వడం లేదని, ఆయా డీలర్లపై సమగ్ర విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని మచిలీపట్నం పట్టణ పౌర సంక్షేమ సంఘం టౌన్ కన్వీనర్ కొడాలి శర్మ అర్జెంటు సమర్పించారు.

గన్నవరం మండలం, వెదురుపావులూరు గ్రామ రెవెన్యూ పరిధిలో దాదాపు 3,500 ఎకరాలలో జొన్న, మొక్కజొన్న పంట సాగై ఉందని, దళారులు మద్దతు ధర కన్నా తక్కువకు కొనుగోలు చేస్తున్నారని జరుగుతున్న నష్టాన్ని వివరిస్తూ, ఆ ప్రాంతంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని గ్రామానికి చెందిన పాలడుగు రత్నారావు తదితర రైతులు కోరారు.

కార్యక్రమంలో డిపిఓ జె అరుణ, ఆర్ అండ్ బి ఈఈ లోకేశ్వరరావు, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారిణిలు ఎన్ పద్మావతి, జే జ్యోతి, డిఎంహెచ్వో డాక్టర్ యుగంధర్, మత్స్య శాఖ అధికారి అయ్య నాగరాజు, జిల్లా సహకార అధికారి చంద్రశేఖర్ రెడ్డి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ టి శివరాం ప్రసాద్, ఎల్డిఎం రవీంద్రారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ అధికారి సోమశేఖర్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...