Skip to main content

జిల్లాలో బాల్య వివాహాలు నిరోధించేందుకు అందరూ బాధ్యత తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

మచిలీపట్నం:

జిల్లాలో బాల్య వివాహాలు జరగకుండా నిరోధించేందుకు అందరూ తమ వంతు బాధ్యత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మత పెద్దలను కోరారు. 

మంగళవారం ఉదయం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో బాల్య వివాహ నిర్మూలనకు 100 రోజుల జాతీయ ప్రచార కార్యక్రమం లో భాగంగా జిల్లా ఉన్నతాధికారులు, మత పెద్దలతో సంయుక్త సమావేశం నిర్వహించారు. 
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కృష్ణా 
జిల్లా పేద జిల్లా కానప్పటికీ ఇక్కడ కూడా బాల్య వివాహాలు జరగడం విచారకరమన్నారు. సాధారణంగా పెళ్ళిళ్ళు రిజిస్ట్రార్ కార్యాలయంలో గాని, గురువులు, మత పెద్దలవద్ద హిందూ, ఇస్లాం, క్రైస్తవ ఆచారాల ప్రకారం జరుగుతున్నాయన్నారు. 
బాల్యవివాహాలు చేసుకున్న వయోజనులను గాని ప్రోత్సహించిన వారిని గాని, పెళ్ళికి హాజరైన వారిని గాని ఎవరిని వదిలిపెట్టే అవకాశం లేదని చట్టరీత్యా అందరికి ఒకే శిక్ష పడుతుందన్నారు. ఆ శిక్షకు బెయిల్ ఉండదని, లక్ష రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. 
ఈ శిక్ష నుండి మరే ఇతర వేదికలలో తప్పించుకునే అవకాశం లేదని స్పష్టం చేశారు.
పెళ్లి జరిగే ముందు పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం పరిశీలించాలన్నారు. 

జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి కే.వి. రామ కృష్ణయ్య మాట్లాడుతూ బాల్య వివాహ నిషేధ చట్టం 2006 నుండి అమలులోకి వచ్చిందన్నారు. 
వివాహ వయస్సు అమ్మాయికి 18 సంవత్సరాలని, అబ్బాయికి 21 సంవత్సరాలు ఉండాలన్నారు. 
బాల్య వివాహాలు జరుగుతుంటే 1098 టోల్ ఫ్రీ నంబర్కు తెలియచేయాలన్నారు
 
జిల్లా ఎస్పీ వీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమన్నారు. చట్టం తెలియదని అంటే కుదరదని స్పష్టం చేశారు.
పెళ్లి జరిగే ముందే వారి పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాన్ని గమనించాలన్నారు. బాల్య వివాహాలు జరిపితే బాధ్యులైన వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిర్దాక్షిణ్యంగా వారిపై కేసులు పెడతామని స్పష్టం చేశారు. మంచి ముహూర్తం అని సమయం దాటితే మళ్ళీ రాదని మంచి పెళ్ళికొడుకు అని భావించి బాల్యవివాహాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరాదని సూచించారు. బాల్య వివాహాల నిరోధక చట్టం కింద 2 సంవత్సరాల జైలు శిక్ష పడుతుందన్నారు. బాల్య వివాహాలు జరుగుతుంటే ఆ సమాచారం పోలీసువారికి తెలియచేయాలన్నారు. చిన్నపిల్లలకు మానసిక పరిపక్వత ఉండదని గమనించి పెద్దలు పిల్లల భవిష్యత్తును పాడు చేయవద్దని, వారు చదువుకునేలా చేయాలని హితవు పలికారు.
అంతేకాకుండా ఫోక్సో చట్టం కూడా దీనికి అనుసంధానం చేస్తామన్నారు. గత 3, 4 నెలల కిందట కూడా బాల్య వివాహాలు జరిగి ఉంటే ఆ కేసులను కూడా పరిశీలించి బాధ్యులైన వారిని ఏ ఒక్కరిని వదిలిపెట్టమని స్పష్టం చేశారు.


అనంతరం జిల్లా కలెక్టర్ బాల్య వివాహ రహిత ఆంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరం కృషి చేస్తామని, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. బాల్య వివాహాల వలన కలిగే ఆరోగ్య సమస్యలను డిఎంహెచ్వో విపులంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ చంద్రశేఖర రావు, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారిని ఎం ఎం ఎన్ రాణి, డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ యుగంధర్, దేవాదాయ శాఖ ఏసి సాంబశివరావు డీఎస్పీ సిహెచ్ రాజా పలువురు హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దలు, ప్రజలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

https://youtu.be/J-fueSNI9Qg?si=paMZ9r3gAqKQTDsR

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...