Skip to main content

మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు

మచిలీపట్నం:

ప్రపంచానికి శాంతియుత మార్గాన్ని చూపి ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని తన రక్తాన్ని చిందించిన త్యాగమూర్తి, కరుణామయుడు ఏసుప్రభువు అని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర కీర్తించారు. 


శుక్రవారం రాత్రి నగరంలోని రైల్వే స్టేషన్ వద్ద గల శుభం కన్వెన్షన్ హాలులో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. 

ఈ వేడుకలలో రాష్ట్ర మంత్రి రవీంద్ర మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా మచిలీపట్నంలో వేడుకలు అందరము కలిసికట్టుగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు  ఆ భగవంతుని ఆశీస్సులతో ప్రజలందరూ కలిసి మంచి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొని వచ్చారన్నారు.
ఎన్ని కష్టనష్టాలు ఉన్నప్పటికీ మొక్కవోని ధైర్యంతో దేవుని ఆశీస్సులతో తమ ప్రభుత్వం ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ఉందన్నారు.
2014 19 సంవత్సర కాలంలో కొన్ని చర్చిల నిర్మాణం కోసం కొన్ని నిధులు సమకూర్చామని అయితే తర్వాత ప్రభుత్వ మారడంతో ఆ నిధులన్నీ తిరిగి వెనక్కు వెళ్ళాయన్నారు  తమ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని అందరము అన్నదమ్ముల వలె కలిసి మెలిసి జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు 

అనంతరం రాష్ట్ర మంత్రివర్యులు  కేకును కట్ కట్ చేసి  క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, రాష్ట్ర మైనారిటీ సంక్షేమ సంస్థ డైరెక్టర్ హసీం బేగ్, జిల్లామైనారిటీ సంక్షేమ అధికారి రబ్బాని, కార్పొరేటర్ అనిత, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచే నాని, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు విద్యాసాగర్, 
మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, కార్యక్రమ నిర్వాహకులు కరుణ కుమారు, బెరక్క మినిస్ట్రీ డైరెక్టర్ బి.ఎస్ కిరణ్ పాల్, సెంట్రల్ చర్చి పాస్టర్ బి సుకుమార్ స్థానిక దైవజనులు టీవీ జాషువా, వెస్లీ, వై.రాజు పలువురు మైనారిటీ ప్రజలు పాల్గొన్నార

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...