Skip to main content

పదవి విరమణ చేస్తున్న పోలీసు సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు


మచిలీపట్నం :

సుదీర్ఘకాలం పాటు పోలీస్ శాఖ లో అత్యున్నత సేవలు అందించి, బుధవారం పదవీ విరమణ చేయుచున్న పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వి.వి నాయుడు , ఏఆర్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ తో కలిసి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు.

పదవీ విరమణ చేయుచున్న సిబ్బంది వివరాలు.

ఎస్సై - 133 ఎం. ప్రేమ్ కుమార్ గన్నవరం పోలీస్ స్టేషన్

ఎస్సై - 309 కె. సాంబశివరావు సిసిఎస్ మచిలీపట్నం.

ఏ ఎస్ ఐ- జి. ఉమామహేశ్వరరావు ఆర్ పేట పోలీస్ స్టేషన్

ముందుగా పదవీ విరమణ చేయుచున్న సిబ్బందికి శాలువాలు ,పూలదండలతో సత్కరించివారి కుటుంబ సభ్యులు, సిబ్బంది సమక్షంలో ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు. 

ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ మాట్లాడుతూ కుటుంబంతో కంటే పోలీస్ శాఖ లోకి ప్రవేశించిన నాటి నుండి నేటి వరకు అహర్నిశలు ప్రజాక్షేమం కోసం కృషి చేసి, గౌరవ ప్రదంగా, మర్యాద పూర్వంగా పదవి విరమణ పొందడం అదృష్టమని, ఇలా పదవీ విరమణ పొందడం బాధగానే ఉంటుందని, జీవితంలో ఉద్యోగం అన్న తరువాత పదవి విరమణ పొందడం కూడా ఉంటుందని, ఉద్యోగంలో మొదటి రోజు ఎలా సంతోషంగా ఉంటామో చివరి రోజున కూడా అంతే ఉత్సాహంగా ఉండాలని, సెలవులు ఉన్నా తీసుకోలేని పరిస్థితిలో కూడా డ్యూటీ చేస్తూ బందాలకు, అనుబంధాలకు, ముఖ్యమైన కార్యక్రమాలకు దూరమై, ఎన్నో భాధలు, బాధ్యతలు ఉన్నా అన్నిటిని మరిచిపోయి పోలీస్ ఉద్యోగాన్ని ప్రతి క్షణం ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఈ పోలీస్ వ్యవస్థకు మంచి సేవలు అందించిన మిమ్మల్ని డిపార్టుమెంటు మరిచిపోదని తెలిపారు. 

పదవి విరమణ పొందిన తరువాత మీ కుటుంబ సభ్యులతో మిగిలిన శేష జీవితాన్ని సుఖ సంతోషాలతో గడుపుతారని ఆశిస్తున్నాను. పదవి విరమణ పొందిన తరువాత కూడా మీకు ఏదైనా సమస్యలు వస్తే పోలీస్ శాఖ తలుపులు ఎప్పుడూ తెరిచే వుంటుందని మీ సమస్యలను పరిష్కరించడంలో ముందు ఉంటామని, మిగిలిన మీ శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో బంధు మిత్రులతో ఆనందమయంగా గడపాలని, ఆరోగ్యం విషయంలో  శ్రద్ధ కనబరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వై. సత్య కిషోర్ , రిజర్వ్ ఇన్స్పెక్టర్ రవికిరణ్ , ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...