నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే శిక్షలు తప్పవు.... ట్రాఫిక్ సీఐ నున్న రాజు.
మచిలీపట్నం :
నగరంలో ఇటీవల కాలంలో మైనర్ బాలురు, బాలికలు యదేచ్ఛగా ద్విచక్ర వాహనాలను అత్యంత వేగంగా నడుపుతున్నారు. జిల్లా ఎస్పీ వీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు మైనర్లను వాహనాలు నడపవద్దని నడుపుతున్న వాహనదారులను ప్రధమ తప్పుగా మందలించి సీఐ నున్న రాజు పర్యవేక్షణలో పోలీసుల స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.
మైనర్లు ద్విచక్ర వాహనాలను నడుపుతుండగా పట్టుకుంటున్న పోలీసులు వారి అడ్రస్సులు తెలుసుకొని వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఇకనుంచి మీ పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వద్దని ఈసారి కనుక పట్టుబడితే జరిమానా విధించి లైసెన్సు రాకుండా చేస్తామని హెచ్చరిస్తున్నారు.
మైనర్లను పట్టుకున్నప్పుడు మైనార్టీ తీరిన తర్వాతనే తాము డ్రైవింగ్ చేస్తామని వారితో సీఐ రాజు ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. ఈ సందర్భంగా సీఐ రాజు మాట్లాడుతూ ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని యువకులు అత్యంత వేగంగా వాహనాలు నడుపుతున్నందున ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయని అన్నారు. మైనర్లతో పాటు యువకులు కూడా వాహనాలను ఫ్యాషన్ కోసం జోరుగా పలువురు దృష్టిని ఆకర్షించడానికి నడుపుతున్నారని అన్నారు.
వాహనాలను నడిపే వారు వేగంగా వెళితే ప్రమాదాలు జరిగితే మన పరిస్థితి ఏమిటని ప్రశ్నించుకోవాలన్నారు. మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుపడితే 5000 రూపాయలు ఫైన్ విధిస్తున్నామన్నారు. అతివేగంగా డ్రైవింగ్ చేస్తూ రాంగ్ రూట్లో వెళ్తున్న, సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్న 2000 రూపాయలు ఫైన్ కట్టిస్తున్నామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాహనాలపై ట్రిపుల్ రైడింగ్ డ్రైవింగ్ చేయకూడదన్నారు.
పాఠశాలలో, కాలేజీలలో విద్యార్థిని విద్యార్థులకు డ్రైవింగ్ నిబంధనలపై అవగాహన కలిగిస్తున్నామన్నారు. మైనర్ బాలురు, బాలికలకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వకుండా జాగ్రత్త తీసుకోవాలని ట్రాఫిక్ సీఐ నున్న రాజు తెలిపారు.
Comments
Post a Comment